అధికారం ఎంత పనైనా చేస్తుంది. నిజాయతీపరుడిని అవినీతి నేతగా మార్చేస్తుంది. నీతులు చెప్పినవారి చేతనే నేరాలు చేయిస్తుంది. ఈ కథాంశంతోనే 'ఆల్ ద కింగ్స్ మెన్' చిత్రం రూపొందించారు. అమెరికా రచయిత రాబర్ట్ పెన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. 1949లో విడుదలైంది. మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రం వచ్చి నేటితో 70 ఏళ్లు పూర్తయ్యాయి.
నీతి నిజాయతీలను నెలకొల్పాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి.. అధికార చదరంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ కరడు కట్టిన అవినీతి నేతగా ఎందుకు మారాడనేదే సినిమా కథాంశం.
సినిమా మొత్తం ఓ పత్రికా విలేకరి దృష్టి కోణంలో సాగుతూ ఆకట్టుకుంటుంది. రాజకీయ రంగంలో పాతుకుపోయిన అవినీతి, నేర రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు బ్రొడెరిక్ క్రాఫోర్డ్ నటించి, ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందకున్నాడు. ఈ చిత్రానికి రాబర్ట్ రాసెన్ దర్శకత్వం వహించాడు.
ఇది చదవండి: ఇండస్ట్రీలో 44 ఏళ్లు.. అప్పటికీ ఇప్పటికీ స్టైల్ అదే
- " class="align-text-top noRightClick twitterSection" data="">