ETV Bharat / sitara

బ్రహ్మానందం కాల్​ చేస్తే కట్​ చేశా: నిరుపమ్

author img

By

Published : May 18, 2021, 10:18 AM IST

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఈ వారం బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేసి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా హాస్యనటుడు బ్రహ్మానందం అప్పుడప్పుడు కాల్​ చేసి అభినందిస్తుంటారని చెప్పారు నిరుపమ్​. మెచ్చుకునేందుకు బ్రహ్మీ తొలిసారి ఫోన్​ చేసినప్పుడు ఆయన అని తెలియక కాల్​ కట్​ చేసినట్లు గుర్తుచేసుకున్నారు.

alito
ఆలీతో

డాక్టర్‌బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్‌. ఆయన భార్య మంజులతో కలిసి ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్​ షో 'ఆలీతో సరదాగా'కు అతిథులుగా విచ్చేసి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా తనకు హాస్యనటుడు బ్రహ్మానందం అభినందించేందుకు కాల్​ చేస్తే కట్​ చేసినట్లు గుర్తుచేసుకున్నారు నిరుపమ్​.

'లేడీస్​ ఫాలోయింగ్​ విపరీతంగా ఉంది కదా ఇప్పటికీ లెటర్స్​, కాల్స్​ వస్తాయా' అని అలీ అడగా.. వస్తుంటాయని నిరుపమ్​ బదులిచ్చారు. "తెలియనివాళ్లు ఫోన్​ చేస్తే రాంగ్​ నంబర్​ అని ఫోన్​ పెట్టేస్తుంటా. అలానే ఓసారి బ్రహ్మానందం గారూ కాల్​ చేస్తే.. ఎవరో అనుకుని పెట్టేశాను. ట్రూ కాలర్​లో చూస్తే ఆయన అని తెలిసింది. తిరిగి చేయాలా వద్దా, ఏమని చెప్పాలి అని సందిగ్ధంలో పడిపోయా. అంతలో వేరే నంబర్ నుంచి ఆయనే మళ్లీ కాల్​ చేశారు. సారీ చెప్పాను. పర్వాలేదు అని అని చెప్పి నా పాత్ర, సీరియల్​ గురించి అభినందించారు. అలా అప్పటి నుంచి సీరియల్​ చూసినప్పుడల్లా రెగ్యులర్​గా కాల్​ చేసి మెచ్చుకుంటుంటారు. తప్పుఒప్పులు చెప్తారు" అని వెల్లడించారు నిరుపమ్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.