ETV Bharat / sitara

'ఎస్వీ రంగారావుగారిని అలా చూస్తే జాలేసింది' - ఆలీతో సరదాగా రోజారమణి చక్రపాణి

కమనీయం, రమణీయం.. వీరివురి సినీ జీవన ప్రయాణం. నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఒకెత్తైతే.. హీరోగా, డైరెక్టర్‌గా ఆయన స్టార్‌డమ్‌ మరో ఎత్తు. వారే ఎవర్‌గ్రీన్‌ జంట.. రోజారమణి, చక్రపాణి. వీళ్లిద్దరూ ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga Talk show) కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికర సంగతులను వెల్లడించారు. ఆ విశేషాలివే..

rojaramani-chakrapani
రోజారమణి, చక్రపాణి
author img

By

Published : Jul 22, 2021, 1:01 PM IST

Updated : Jul 22, 2021, 4:16 PM IST

ఈటీవీలో ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga Talk show) కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు అలనాటి తారలు రోజారమణి, చక్రపాణి. తమ కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటంటే?

ముద్దుగా 'కుట్టి' అని పిలుస్తారా ఇంట్లో?
రోజారమణి: నన్ను అలా పిలిచేది దాసరి నారాయణరావు గారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్‌ ఉన్నా కేరళ నుంచి నేను విమానంలో వచ్చేదాన్ని. కేరళలో కుట్టి (అమ్మాయి) అని పిలుస్తారు కదా. (నవ్వుతూ)

మీది ఏ ఊరు?
చక్రపాణి: మాది శ్రీకాకుళంలోని పలాస. వైజాగ్‌ మా తాతగారి వాళ్లది. కానీ, మానాన్న గారు రైల్వేలో మెకానికల్‌ ఇంజినీర్‌గా జాబ్‌ చేసేవారు. ఆయన ఖుర్దారోడ్‌లోని రీజినల్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఉండేవారు. అందుకే మేము అక్కడ ఉండాల్సి వచ్చింది. నా చదువు అంతా అక్కడే కొనసాగింది.

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు?
చక్రపాణి: 1976లో..! 1974-76 వరకూ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో.. ఆ తరువాత 1976లో ఇండస్ట్రీలోకి వచ్చా.

మీ బ్యాచ్ మేట్స్‌ ఎవరు?
చక్రపాణి: రాజేంద్ర ప్రసాద్‌ నేనూ ఒకే బ్యాచ్‌. మా కన్నా ఒక సంవత్సరం ముందు రజనీకాంత్‌. మా తరువాతి బ్యాచ్‌లో చిరంజీవి, సుధాకర్ వీళ్లంతా ఉండేవాళ్లు.

తొలిసారి కెమెరాను ఎప్పుడు ఫేస్‌ చేశారు?
చక్రపాణి: 1976లో ఎం.ఎస్‌.రెడ్డి గారి చిత్రం 'ముత్యాల పల్లకి' . ఆ చిత్రంలో నేనే హీరోయిన్‌. (రోజారమణి నవ్వుతూ)

చక్రపాణిగారి గురించి ఎప్పుడు తెలిసింది?
రోజారమణి: పునర్‌మిలన్‌ అని ఒరియా చిత్రం తెలుగులో 'ఆడపడుచు'గా వచ్చింది. దాని డైరెక్టర్‌ హేమంబర్‌. అందులో ఫస్ట్‌సీన్‌ పెళ్లిచూపులు. ఇద్దరం తెలుగు వారమే. హేమంబర్‌ చాలా సాఫ్ట్‌ మనిషి. ఈ చిత్రంలో అందరూ ఒరియా వాళ్లే హీరో తప్ప. అలా చక్రపాణిని పరిచయం చేశారు.

మీ ఇద్దరి పెళ్లి ఎలా కుదిరింది?
చక్రపాణి: ఆ తరువాత మేమిద్దరం చాలా సినిమాల్లో కలిసి నటించాం. సతీ అనసూయ, లవకుశ, రవిసామ్రాట్‌ ఉపేంద్ర బందూ.. అలా అలా మా మధ్య బంధం కుదిరింది.

rojaramani-chakrapani
రోజారమణి, చక్రపాణి

ఒరియాలో మిమల్ని ఎన్టీఆర్‌ అంటారెందుకు?
చక్రపాణి: తెలుగులో ఎన్టీఆర్‌ చేసిన చాలా చిత్రాలను నేను ఒరియాలో రీమేక్‌ చేశా. వాటికి నిర్మాతలుగా తెలుగు వారు క్రాంతికుమార్‌, కుమార్‌జీ వ్యవహరించారు. వారు రీమేక్‌ చిత్రాలను ఎక్కువగా చేసేవారు. లవకుశ, ఆడపడుచు, కలసిఉంటే కలదు సుఖం, సీతా లవకుశ.. ఇలాంటి చిత్రాల్లో రామారావుగారు పోషించిన పాత్రలు నాకు లభించాయి. అవి హిట్‌ అవ్వడం. అలాగే మైథాలజీ కూడా. లవకుశను అక్కడ రీమేక్‌ చేస్తే 100 రోజులు ఆడింది. మళ్లీ దాన్ని తెలుగులోకి రీమేక్‌ చేస్తే రోజారమణి సీతగా, నేను రాముడిగా చేశా.

ఒరియాలో ఎన్ని చిత్రాల్లో నటించారు?
రోజారమణి: ఏడు చిత్రాల వరకు చేశా. అందులో ఐదు చక్రపాణితోనే నటించాను.

చక్రపాణి: మొత్తం కలిపి 100 పైగా. హీరోగా ఒరియాలో ఎక్కువ చిత్రాలు చేశా.

ఏ ఏడాదిలో పెళ్లి చేసుకున్నారు?
రోజారమణి: 1981. పెళ్లయిన నాటి నుంచి నేను సినిమాల్లో నటించడం మానేశా.
చక్రపాణి: నేను అటు తెలుగు, ఒరియాలో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నా. ఇక ఒరియాలో నెంబర్‌.1గా ఉండే సరికి దాని మీదే దృష్టి పెట్టా.

తెలుగులో మీకు బాగా పేరు తెచ్చిన చిత్రం?
చక్రపాణి: నేను, శారద కలిసి నటించిన 'నిమజ్జనం'. బీఎస్‌ నారాయణ గారు దానికి దర్శకత్వం వహించారు. అందులో నాది యాంటీ క్యారెక్టర్‌.
రోజారమణి: అప్పటి వరకు ఈయన రాముడు, కృష్ణుడు లాంటి సాఫ్ట్‌ పాత్రలు వేశారు. కానీ, ఇందులో ప్రతినాయకుడి పాత్ర చేశారు. ఆ చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. శారదకు మూడో సారి అవార్డు వచ్చింది. ఊర్వశి పురస్కారం కూడా అందుకొంది. ఆమెతో పని చేయడం కూడా అదృష్టమే. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మొన్న కూడా మా ఇద్దరికీ సన్మానం చేస్తే శారదగారు స్టేజీ మీద పాట పాడారు

rojaramani-chakrapani
చక్రపాణి

మరి ఎప్పుడు ఒరియాను వద్దనుకున్నారు?
చక్రపాణి: అప్పట్లో రెండు భాషల్లో చిత్రాలు చేస్తున్నా. ఒక రోజు రామోజీరావు గారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన ప్రారంభించిన ఒరియా ఛానెల్‌లోకి ఆహ్వానించారు. అలా ఈటీవీ ఒరియా కూడా విజయవంతమైంది.
రోజారమణి: రామోజీరావుగారితో మాకు చాలా అనుబంధం ఉంది. తరుణ్‌ను బాలనటుడిగా 'మనసు మమత'తో పరిచయం చేసింది ఆయనే. హీరోగా 'నువ్వేకావాలి' చిత్రానికి నిర్మాత ఆయనే. రవికిషోర్‌ గారు కూడా దానికి నిర్మాతగా ఉన్నారు. చక్రపాణిగారు ఒరియా ఛానెల్‌కు హెడ్‌గా చేశారు. ఆయన నిర్మాతగా చేసిన చిత్రాల్లో మూడు, నాలుగు చిత్రాలకు నేను డబ్బింగ్‌ చెప్పాను. మా కుటుంబంతో ఆయనకు గొప్ప అనుబంధం ఉంది. రామోజీరావుగారితో పనిచేయడం గొప్ప అదృష్టం.

ఇండస్ట్రీలో మంచి అనుబంధం ఎవరితో ఉంది?
చక్రపాణి: నేను చాలా లిమిటెడ్‌గా ఉంటా. ఎక్కువ మందితో కలవలేను. ముందు నుంచి నా పని, నేను అంతే. అందులోనూ ఈమధ్య సినిమాలేవీ చేయడం లేదు.
రోజారమణి: మొదటి నుంచి భానుమతిగారంటే చాలా ఇష్టం. ఆయన్ను సొంత కుమారుడిలా చూసుకునేవారు.
చక్రపాణి: భానుమతిగారంటే చాలా మంది భయపడతారు. ఆవిడ నాతో సరదాగా ఉండేవారు. అలాంటి వాళ్లతో పనిచేయడం నా అదృష్టం. నేను తమిళ్‌లో హీరోగా చేసిన ఒక సినిమాకు ఆవిడే నిర్మాత. అదే తెలుగులో 'రచయిత్రి.. ఒకనాటి రాత్రి' అని తెలుగులో చేశాను. మా పెళ్లయ్యాక కూడా వచ్చి ఆశీర్వదించారు.

మీ ఇంట్లో చక్రపాణిగారితో పెళ్లి అంటే ఒప్పుకున్నారా?
రోజారమణి: ఒప్పుకోవడం అంటే.. అభ్యంతరమేమీ చెప్పలేదు. ఫైటింగ్‌, ఛేజింగ్‌లు ఏమీ లేవు( నవ్వుతూ)

చిన్నప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు కాకుండా పౌడర్‌ తినేవారంట. ఇప్పటికీ తింటున్నారా?
రోజారమణి: ఓ అదా! అది కుట్టీకూర పౌడర్‌. చేతిలో ఇంతింత వేసుకొని ముఖానికి రాసుకొని ఆ తరువాత నోట్లో వేసుకునే దాన్ని. అమ్మ తిట్టేవారు.
చక్రపాణి: (నవ్వుతూ) అరే! నిజంగా నాకీ విషయం తెలిదు. ముందే తెలిసుంటే రోజుకో డబ్బా కొనిచ్చేవాడినే.

rojaramani-chakrapani
రోజారమణి, చక్రపాణి

స్విట్జర్లాండ్‌లో పూజ చేస్తే పోలీసులు వచ్చారంట ఏమిటది? అంటే అంత గట్టిగా చేశారా?
రోజారమణి: తరుణ్‌ పూజ చేసినప్పుడు జరిగింది. మా పూజ గది చూడండి. విశ్వనాథ్ గారి సినిమాలో శ్రీలక్ష్మీ నల్లగా చేసినట్లు ఉంటుంది. దానికి రంగులు వేయించినా మళ్లీ అదే రంగులోకి వచ్చేస్తుంది. బయట నుంచి చూస్తే ఏదో కాలిపోతున్నట్టు ఉంటుంది. సమ్మర్‌ అని సరదాగా స్విట్జర్లాండ్‌కు వెళ్లాం. అప్పుడక్కడ తరుణ్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. మేము ఇండియా నుంచి పట్టుకెళ్లిన అగరుబత్తులు , కర్పూరాలే ఎక్కువ. తరుణ్‌ అవన్నీ వెలిగించే సరికి పొగ వచ్చేసింది. అప్పుడే పోలీసులు నలుగురు వచ్చేశారు. పొగ వచ్చేసరికి ‘ఏమి జరిగిందంటూ’ ఒకటే ప్రశ్నలు. తరుణ్‌ ఏమో టవల్‌ కట్టుకొని దేవుడికి దణ్ణం పెట్టుకొని ఉన్నాడు. దేవుడికి పూజ చేస్తున్నా అని చెప్పేసరికి వాళ్లంతా నవ్వేసి.. రూమ్‌లో కాదు. వరండాలో చేసుకోండని చెప్పారు. మర్నాడు నుంచి వరండాలో పూజ చేయడం ప్రారంభించారు. తండ్రీ కొడుకులిద్దరికీ భక్తి ఎక్కువే. నిత్యం గంటన్నర పూజ చేస్తారు. 'భక్త ప్రహ్లాద' పాత్ర నేను పోషిస్తే భక్తి వాళ్లకి వచ్చింది.

భక్త ప్రహ్లాద వచ్చి 50 ఏళ్లు అయ్యింది కదా!
రోజారమణి: అదృష్టం ఏమిటంటే.. అప్పుడే ఈటీవీలో వచ్చే 'పాడుతా తీయగా' చేశా. బాలసుబ్రహ్మమణ్యంగారికి అప్పుడే 50 ఏళ్లు నిండాయి. అలా ఇద్దరం పరస్పరం విషెస్‌ చెప్పుకున్నాం. అలాగే ‘స్వరాభిషేకం’ చేశాను. అవన్నీ మర్చిపోలేని సంఘటనలు.

మీకు యాక్టింగ్‌ అంటే ఇష్టమా, డబ్బింగ్‌ అంటే ఇష్టమా?
రోజారమణి: నాకు యాక్టింగ్‌ అంటే ప్రాణం, సినిమా అంటే ప్రాణం. డబ్బింగ్‌ కాదు. సినిమా, కెమెరా తప్ప వేరే ప్రపంచం లేదు.

rojaramani-chakrapani
చక్రపాణి

మీ చిత్రం కాకుండా తొలిసారి ఏ సినిమాకు డబ్బింగ్‌ చెప్పారు?
రోజారమణి: మురళీ మోహన్‌గారు ఆఫర్‌ చేసిన ‘నిర్దోషి’ చిత్రానికి. అందులో సుహాసిని పాత్రకు డబ్బింగ్‌ చెప్పా. ఆ తర్వాత వందల చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పా. సుహాసిని, మీనా ఇలా చాలా మందికి చెప్పా. హీరోయిన్‌ రిపీట్‌ అవుతూ అలా 350 మందికి పైగా చెప్పా.

ఓ పెద్ద హీరో మిమ్మల్ని 'ప్రహ్లాదా' అని పిలుస్తుంటారంట. ఎవరు?
రోజారమణి: కమల్‌హాసన్‌. 'డే ప్రహ్లాదా' అని పిలుస్తారు. మేమిద్దరం ఏవీఎం స్టూడియోస్‌ నుంచి వచ్చాం. కమల్‌గారితో ఐదు చిత్రాలు చేశా. సొమ్ముఒకడిది సోకొకడది, మలయాళంలో నేషనల్‌ అవార్డు అందుకున్న 'కోకిల'. రెండు మలయాళం, ఒకటి తెలుగు చేశాను. మొత్తం 130 చిత్రాలు చేశా.

rojaramani-chakrapani
రోజారమణి

టీవీవైపు వెళ్లాలని ఎప్పుడైనా అనిపించిందా?
రోజారమణి: నిర్మాతగా వెబ్‌సిరీస్‌ చేయడం ఇష్టం. మిమ్మల్ని పెట్టి ఒకటి తీస్తా. (నవ్వుతూ)

చక్రపాణి గారిలో మీకు నచ్చిన క్వాలిటీ, నచ్చని క్వాలిటీ ఏంటి?
రోజారమణి: నచ్చిన క్వాలిటీ కాదు.. క్వాలిటీస్‌ ఉన్నాయి. క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతగా ఉంటారు. ఇవన్నీ చాలా ఎక్కువ. ఆయనో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌. కొన్ని చిన్నచిన్న విషయాలు నచ్చవు. కొంచెం ఏసీ, ఫ్యాన్‌ స్పీడ్‌ ఎక్కువ పెడితే నచ్చదు. పాటలు శబ్దం ఎక్కువ పెడితే నచ్చదు. ఆయననేమో గజల్స్‌ వింటారు. మేము పాటలు వింటాం. అవేమో నాకు అర్థం కావు. నాకు హిందీ అర్థం కాదు. ఆయన ఆరు భాషలు స్పష్టంగా మాట్లాడతారు. కోపం కూడా ఎక్కువే.
చక్రపాణి: నాకు ముందు నుంచీ అంతే. ఎవరైనా పద్ధతి పాటించకపోతే కోపం వస్తుంది. నాకు ఫుడ్‌ ముఖ్యం కాదు. పని అనుకున్న సమయంలో అవ్వడం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యాక్టర్‌ అవ్వకముందు చక్రపాణి అంటే ఎవరు?
చక్రపాణి: అప్పుడు నేను పీఎన్‌కాలేజీలో చదువుకునే వాడిని. తరువాత మధురై యూనివర్సీటీలో పీజీ చేశా. చిన్నప్పటి నుంచి మిలటరీ అంటే చాలా ఇష్టం. మా ముత్తాతలు ఆ ఉద్యోగం చేశారు. మా నాన్నగారేమో రైల్వే. ఆ తరువాత డాక్టర్‌ అవ్వాలని బైపీసీ తీసుకున్నా. ఓ రోజు వైజాగ్‌ రైళ్లో వెళ్తుంటే నిర్మాత ఎం.బాలయ్యగారు ఫస్ట్‌ క్లాస్‌లో ఉన్నారు. ఆయన, నేను తప్ప ఎవరూ లేరు. ఆయన ‘నువ్వెందుకు సినిమాల్లో చేయకూడదు’ అని ప్రోత్సహించారు. నాకు స్టేజీ అనుభవం లేదంటే.. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరమని సూచించారు. ఆయన సూచన మేరకు మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరాను.

తరుణ్‌ ఏం చేస్తున్నాడు?
రోజారమణి: కరోనా టైంలో అంతా ఆగిపోయేసరికి.. కొత్తగా వెబ్‌సిరీస్‌కు కథలు.. అలాగే ఒక సినిమా కథ వింటున్నాడు.

పోలీసు శాఖలో పనిచేశారా?
చక్రపాణి: నేను చెన్నై సిటీ పోలీసుశాఖలో ఉండేవాడిని. తరువాత హైదరాబాద్‌కి వచ్చేశాం.
రోజారమణి: ఆయన అన్యాయం జరిగితే సహించలేరు. అంటే పోలీసు యూనిఫాం వేసుకోకపోతే అలా ప్రవర్తించేవారు ఇక వేసుకుంటే డబుల్‌ బిహేవ్‌ చేసేవారు. మంచి ఉద్యోగం అది. లాఠీ కూడా ఎప్పుడు కార్‌లోనే ఉండేది. ఎవరైనా రాంగ్‌ రూట్‌లో వెళ్తుంటే ఆ లాఠీ తీసేవారు. అందుకే దాచేసేవాళ్లం.

రామకృష్ణ.. చక్రపాణిలా ఎలా మారారు?
చక్రపాణి: రామకృష్ణ నా అసలు పేరు. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఉన్నప్పుడు కూడా రామకృష్ణా రావే. ఎంఎస్‌రెడ్డి గారి 'ముత్యాలపల్లకి'లో రామారావు, కృష్ణ ఉన్నారు. రామకృష్ణ అని హీరోగా కూడా ఉన్నారు. ఇక ఎంఎస్‌ రెడ్డిగారే చక్రపాణి అని పేరు పెట్టారు. రామకృష్ణా అన్నా ఒకటే.. చక్రపాణి అన్నా ఒకటే అన్నారు.
రోజారమణి: ఆయనెప్పుడైతే.. రామకృష్ణ అని అన్నారో అప్పటి నుంచి రాముడి వేషాలు.. కృష్ణుడి వేషాలు.. అన్నీ దేవుడు పాత్రలే వేశారు.

rojaramani-chakrapani
రోజారమణి, చక్రపాణి

మీరు దర్శకత్వం కూడా చేశారు కదా!
చక్రపాణి: ఒరియాలో తెలుగు సినిమా 'ఆమె', 'ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం' రీమేక్‌ను నేనే డైరెక్ట్‌ చేశా. ఆ రెండు అక్కడ పెద్ద హిట్లే

ఆ తరువాత మళ్లీ డైరెక్షన్‌ ఎందుకు చేయలేదు?
చక్రపాణి: తెలుగు,ఒరియా మార్కెట్లు భిన్నమైనవి. అప్పట్లో పూరిజగన్నాథ్‌ ప్రాజెక్ట్‌ చేయాలని కోరిక. దాని మీద వర్క్‌ చేయాలని ఉంది. తర్వాత ఈటీవీకి పని చేయడం, ఆపై నా వ్యాపారాలు.. అలా సాగిపోయింది.

మీ పిల్లలు ఎవరితో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు?
చక్రపాణి: రోజారమణితోనే. మగపిల్లలెప్పుడు వాళ్ల అమ్మలతోనే క్లోజ్‌గా ఉంటారు కదా(నవ్వుతూ). నాన్న ఎప్పుడూ ఆంక్షలు పెడుతుంటారు. తరుణ్‌ కుటుంబ సభ్యులకు చాలా గౌరవం ఇస్తాడు. పెద్దవాళ్ల ఇంట్లో పనిచేసే వాళ్లన్నా సరే.ఏదైనా ఇష్యూ జరిగి మేము హర్ట్‌ అయి అడిగినా వెంటనే ఇదైపోతాడు. నోరెత్తి జవాబు చెప్పడు. తరువాత " ఐ యామ్‌ సారీ డాడీ!" అని చెబుతాడు. హీ ఈస్‌ ఎ నోబుల్‌ పర్సెన్‌.

మీ కెరీర్‌లో జరిగిన సంతోషకర సంఘటనలేంటి?
చక్రపాణి: అంజలి చిత్రానికి తరుణ్‌కు జాతీయ పురస్కారం, ఒక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు జపాన్‌ వెళ్లాం. దానికి అవార్డ్‌ వచ్చింది. నా ఫేవరేట్‌ నరేంద్రమోదీ (పార్టీ పరంగా కాదు) నేను ఆయన్ను కలిసి 20 నిమిషాలు కలిసి మాట్లాడాను. ఎన్నో విషయాలు మాట్లాడారు. అది మరువలేని సంఘటనలు.
రోజారమణి: కరోనా వచ్చాక ఫంక్షన్స్‌ లేవు కదా! మా ఇద్దరికీ కలిపి యూకేలోని వంశీ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఒక అవార్డు ప్రకటించారు. మనం ప్రయాణించలేని పరిస్థితుల్లో జూమ్‌ ఏర్పాటు చేసి మా బాబు, పాపతో అవార్డు ఇప్పించారు. పిల్లలు గిఫ్ట్‌ కాకుండా అవార్డు ఇవ్వడం మాకో స్వీట్‌ మెమొరీ.

rojaramani-chakrapani
తరుణ్​

చిన్నప్పుడు రేడియో కొనివ్వమని అడిగేవారంట
రోజారమణి: చిన్నప్పటి నుంచి నాకు పాటలు, డ్యాన్స్‌ అంటే ఇష్టం. చిన్నప్పుడు మర్ఫి రేడియో ఉండేది. అప్పట్లో ఎలక్ట్రానిక్‌ సామాను అంటే అదొకటే. అది మాఇంట్లో ఉండేది .దానికి బటన్స్‌ ఉంటాయి అవి తిప్పేస్తే పాడైపోతాయి. చిన్నప్పుడు పాటలు వస్తే సౌండ్‌ పెంచేసేదాన్ని. అలా ఎప్పుడు పట్టుకున్నా పాడైపోతుందని ఇంట్లో అంటుండేవారు. అందుకే, నాకంటూ ప్రత్యేకంగా రేడియో ఉండాలని కోరుకునే దాన్ని. లక్కీగా ప్రహ్లాద సెలక్షన్‌ అయ్యాక... ఎవీఎం గారు పిలిచి.. నీ పేరేంటి..? అని అడిగితే .. రోజారమణి అని చెప్పా. కాదు.. ఈరోజు నుంచి నీ పేరు రోజారమణి కాదు ప్రహ్లాద అని చెప్పారు. ఆ తరువాత నీకేం కావాలని అడిగితే.. వెంటనే రేడియో కావాలన్నా. ట్రాన్సిస్టర్‌ ( రేడియో కమ్‌ క్యాసెట్‌) తెప్పించి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నేనే క్వీన్‌.

ఎస్వీ రంగారావుగారితో నటించడం ఎలా అనిపించింది?
రోజారమణి: అప్పుడు ఆయన అంత గొప్ప నటుడు అని తెలియదు. 'భక్తప్రహ్లాద' తర్వాత ఆయనతో ఒక సినిమా చేశా. అందులో ఆయనది తోటమాలి పాత్ర. బట్టతల, చిరిగిపోయిన బట్టలు.. నన్నెత్తుకొని ఓ పాట పాడతారు. 'భక్తప్రహ్లాద'లో కిరీటం, పట్టుపంచెలు, నగలు పెట్టుకున్న ఆయన ఇలా అయిపోడేంటి? అనుకున్నా. చాలారోజులకు ఇదంతా ఆయన నటించే పాత్ర అని తెలిసింది.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కలిసి భోజనం చేశారట!
రోజారమణి: అప్పుడు చిన్నవయస్సు నాకేమీ తెలియదు. ఆయన రాష్ట్రపతి అన్న విషయం కూడా తెలియదు. తరువాత నుంచి తెలిసిందన్నమాట. చిన్నప్పటి నుంచి చిత్రసీమలో ఉండటం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. కేవలం ట్యూషన్‌ టీచర్స్‌ మాత్రమే తెలుసు. అలాంటిది విద్యార్థులు, టీచర్స్‌ ఎంతగానో అభిమానించే సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి ఆశీర్వాదాలు తీసుకోవడం నిజంగా నా అదృష్టం. అలాగే తరుణ్‌ది , నాది తొలిచిత్రం దిల్లీకి వెళ్లడం. గ్రేట్‌ అండ్‌ కోన్సిడెన్స్‌.

చిరంజీవిగారితో కూడా బాగా సాన్నిహిత్యం ఉంది కదా!
చక్రపాణి: 'ఐ లవ్‌ హిమ్‌ లైక్‌ ఎనీ థింగ్' మా కుటుంబసభ్యులందరూ ఆయన్ని గౌరవిస్తారు. ఆయనకి గొప్ప సంస్కారం ఉంది. అందరినీ బాగా పట్టించుకుంటారు. ఆయన గురించి చెప్పాలంటే మీదొక ఫుల్‌ ప్రోగ్రాం చేయాలి (నవ్వుతూ). 'నువ్వేకావాలి' హిట్‌ అయ్యాక ఫస్ట్‌ బొకే ఆయనే పంపించారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు.

ఇండస్ర్టీలో మరో ఇద్దరిని ప్రేమగా తమ్ముడు అని పిలుస్తారట!
రోజారమణి: సంగీత దర్శకుడు చక్రిని. నన్ను అక్కయ్య అని పిలిచేవాడు. ఇంకా అందులో మీరు (ఆలీ) కూడా ఒకరు. నాకు మా బ్రదర్స్‌ కంటే ఎక్కువైన ఒకాయన ఉండేవారు.. ఆయన ఈ మధ్యే చనిపోయారు.

మళ్లీ కెమెరా ముందుకు రావాలని అనుకుంటున్నారా?
చక్రపాణి: ఏదైనా మంచి పాత్రలు అడిగితే తప్పకుండా చేస్తా. మొన్నామధ్య అడిగారు బిజీగా ఉండటం వల్ల చేయలేదు.

ఇదీ చూడండి: హీరో తరుణ్ భక్తిని చూసి ఆ దేశ పోలీసులు హడల్!

Last Updated : Jul 22, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.