ETV Bharat / sitara

బ్రేకప్​ రూమర్స్​కు చెక్​ పెట్టిన ఆలియా - Alia Bhatt's hilarious reaction to reports of split with Ranbir

మార్చి 15న జరిగిన ఆలియా భట్​ పుట్టినరోజు వేడుకకు రణ్​బీర్ ​కపూర్​ ఎందుకు హాజరుకాలేదు? వీరిద్దరి​ మధ్య ఏమైనా మనస్పర్థలు తలెత్తాయా? అన్న నెటిజన్ల అనుమానాలకు చెక్​ పెట్టింది ముద్దుగుమ్మ ఆలియా. వారిద్దరి బంధం బలంగానే ఉన్నట్లు తన సమాధానం ద్వారా తెలుస్తోంది.

Alia Bhatt's hilarious reaction to reports of split with Ranbir
నవ్వుతో... తన బ్రేకప్​పై వచ్చిన రూమర్స్​కు చెక్​
author img

By

Published : Mar 21, 2020, 12:01 PM IST

Updated : Mar 21, 2020, 12:08 PM IST

బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్ కపూర్​-ఆలియా భట్​ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల మార్చి 15న పుట్టినరోజు వేడుకలు తన స్నేహితులతో కలిసి ఉత్సాహంగా చేసుకుంది ఆలియా. అయితే ఆ వేడుకలో ప్రియుడు రణ్​బీర్​ కనపడలేదు. సామాజిక మాధ్యమాల్లో సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపినప్పటికీ చాక్​లెట్​ బాయ్​ విషెష్ చెప్పలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఏమైనా వివాదం తలెత్తిందా? బ్రేకప్​ చెప్పుకున్నారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ అనుమానలన్నింటికీ చెక్​ పెట్టింది ఆలియా.

Alia Bhatt's hilarious reaction to reports of split with Ranbir
బాలీవుడ్ లవ్​బోర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​-ఆలియా భట్​

ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్​ ఈ పుకార్లపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా.. నవ్వుతూ తనదైన శైలిలో స్పందించింది ఆలియా. అవన్నీ చెత్త పుకార్లని కొట్టిపారేసింది. రణ్​బీర్​.. ఈ మధ్యే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న తన తండ్రి బాలీవుడ్​ సినీయర్​ నటుడు రిషికపూర్​ తల్లి నీతూ సింగ్​తో కలిసి గడుపుతున్నాడని తెలిపింది. అలా ఈ రూమర్స్​కు తెరదించింది.

ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు 'బ్రహ్మాస్త్ర', 'గంగూబాయ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఆలియా. 'బ్రహ్మాస్త్ర'లో రణ్​బీర్​తో​ తొలిసారిగా జోడి కట్టనుందీ భామ.

ఇదీ చూడండి : బ్రేకప్​ బాటలో రణ్​బీర్​-ఆలియా.. ఆ నటి వల్లేనా?

Last Updated : Mar 21, 2020, 12:08 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.