సినిమాల్లో హీరోహీరోయిన్లు పాటలు పాడటం కొత్తేమి కాదు. ఇప్పుడా జాబితాలోకి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మరోసారి చేరనుందట. ఇప్పటికే రెండు హిందీ చిత్రాల్లో పాడిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ కోసం మరోసారి గొంతు సవరించుకోనుందని సమాచారం.
దర్శకుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో సీతారామరాజు(రామ్‌చరణ్) భార్య సీతగా ఆలియా నటిస్తోంది. కొమరం భీమ్‌గా జూ.ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇతరపాత్రల్లో అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు దర్శనమిస్తారు.
ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తుండగా, డీవీవీ దానయ్య రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు సినిమా రానుందని ఇప్పటికే ప్రకటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">