ETV Bharat / sitara

ఆస్కార్​ సభ్యులుగా ఆలియా భట్, హృతిక్ రోషన్​

బాలీవుడ్​ తారలు ఆలియాభట్​, హృతిక్​ రోషన్​ తదితరులకు అకాడమీ అవార్డ్స్(ఆస్కార్స్)​ సభ్యులుగా చేరేందుకు ఆహ్వానం అందింది. దీనిని అంగీకరించిన వారు, వచ్చే ఆస్కార్​ అవార్డులు ఓటింగ్​లో పాల్గొనే అవకాశం దక్కించుకోనున్నారు.

author img

By

Published : Jul 1, 2020, 4:19 PM IST

Alia Bhatt, Hrithik Roshan
ఆలియా, హృతిక్​

అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్షర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​(ఐఎంపీఏఎస్​)లో సభ్యులుగా చేరాలని 819 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్​కు ఆహ్వానం అందింది. వీరిలో బాలీవుడ్​ తారలు ఆలియా భట్​, హృతిక్​ రోషన్​, కాస్ట్యూమ్​ డిజైనర్​ నీతా లుల్లా ఉన్నారు. వీరితో పాటే క్యాస్టింగ్​ డైరెక్టర్​ నందిని శ్రీకాంత్​​, డాక్యుమెంటరీ ఫిల్మ్​మేకర్స్​ నిష్ట జైన్​, షర్లీ అబ్రహం, అమిత్​ మాధేషియా, విజువల్​ ఎఫెక్ట్స్​ సూపర్​వైజర్​ విశాల్​ ఆనంద్​, సందీప్​ కమల్​లు ఈ జాబితాలో ఉన్నారు.

ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి, వచ్చే ఏడాది ఏప్రిల్​ 25న జరిగే 93వ ఆస్కార్​ అవార్డుల విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఓటు హక్కు లభిస్తుంది. ఈ ఏడాది ఆహ్వానం అందుకున్న వారిలో 45 శాతం మహిళలు, 68 దేశాలకు చెందిన కళాకారులు ఉన్నట్లు అకాడమీ తెలిపింది.

వివాదాలను అరికట్టేందుకే

ప్రతిభను గుర్తించడంలో విఫలమైందంటూ 2016లో ఆస్కార్​ అవార్డులను 'వైట్'​గా పిలిచారు. ఈ క్రమంలోనే అటువంటి వివాదాలకు కళ్లెం వేసేందుకు, ఓటింగ్​ విషయంలో నాణ్యతగా పాటించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు అకాడమీ అధ్యక్షుడు డేవిడ్​ రూబిన్​ తెలిపారు. దీనితో పాటే నామినేషన్​ల ప్రమాణాలను అమలు చేయడం సహా ఐదేళ్లకు కొత్త ప్రణాళికను ఆకాడమీ ప్రకటించింది.

హాలీవుడ్​ ప్రముఖలూ ఆహ్వానం

2019 ఉత్తమ చిత్రంగా నిలవడం సహా అనేక విభాగాల్లో ఆస్కార్​ అందుకున్న 'పారాసైట్'​ బృందం నుంచి కొంతమంది నటీనటులకు అకాడమీ ఆహ్వానం పంపింది. వీరితో పాటే సింథియా ఎరివో, జాన్ డేవిడ్​ వాషింగ్టన్​ లాంటి హాలీవుడ్ ప్రముఖుల పేర్లూ ఈ జాబితాలో ఉన్నాయి.

గతేడాది 842 మంది సభ్యులను కొత్తగా ఆహ్వానించగా.. వారిలో భారత్ ​నుంచి జోయా అక్తర్​, అనురాగ్​ కశ్యప్​, సీనియర్ నటుడు అనుపమ్​​ ఖేర్​​లు ఉన్నారు.

నామినేషన్​ ఎంపికలో 'గల్లీబాయ్' విఫలం

గతేడాది భారత్​ నుంచి ఆస్కార్​ రేసులో నిలిచిన 'గల్లీబాయ్'.. అకాడమీ నామినేషన్​కు ఎంపిక కావడంలో విఫలమైంది. ఈ సినిమాలో రణ్​వీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లు. జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి:ఓటీటీల్లో రాజ్యమేలుతున్న అలాంటి వెబ్​సిరీస్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.