ETV Bharat / sitara

పదేళ్లకే పెళ్లి చేసుకున్న ఆ సీనియర్​ నటి! - ఆలీతో సరదాగా డబ్బింగ్​ జానకి

ఆలీతో సరదాగా టాక్​ షోకు ఈ సారి అలనాటి నటి కృష్ణవేణి, డబ్బింగ్​ జానకి విచ్చేసి.. తమ కెరీర్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అది మీరూ ఓ సారి చూసేయండి..

ali to saradaga Senior Actress krishnaveni, dubbing Janaki
అలనాటి నటి కృష్ణవేణి, డబ్బింగ్​ జానకి
author img

By

Published : Apr 13, 2021, 8:23 PM IST

'పదేళ్లకే నాకు పెళ్లి చేశారు. దాంతో నా తోటి వాళ్లంతా నన్ను ఏడిపించేవారు' అని గతాన్ని గుర్తు చేసుకున్నారు అలనాటి నటి కృష్ణవేణి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి డబ్బింగ్‌ జానకితో కలిసి విచ్చేశారామె. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

ఈ షోలో బాల్యంలో తను చేసిన సాహసాలు, నట ప్రయాణం, బాల్య వివాహం తదితర విషయాలు పంచుకున్నారు కృష్ణవేణి. 'నన్ను దాసరి జానకి అంటే గుర్తుపట్టరు. డబ్బింగ్‌ జానకి అనాలి. అయినా డబ్బింగ్‌ శర్మగారని ఎందుకు అనరు? డబ్బింగ్‌ జగ్గయ్యగారని ఎందుకు అనరు? నన్ను మాత్రమే ఎందుకు డబ్బింగ్‌ జానకి అంటారని చాలాసార్లు పోట్లాడాను' అని ప్రశ్నించారు నటి జానకి.

తన వివాహం, కిళ్లీ సంగతులు చెప్తూ నవ్వులు పంచుతున్నారామె. నటిగా ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది? కృష్ణవేణి బాల్యంలోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జానకికి మాత్రమే డబ్బింగ్‌ బిరుదు ఎందుకిచ్చారు? తెలుసుకోవాలంటే ఏప్రిల్ 19వ తేదీ 9:30గంటల వరకు వేచి చూడాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రోమోను చూసి ఆనందించండి...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆ సీన్​ చూసి నా భార్య భయపడిపోయింది!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.