దర్శకుడు తేజ అంటేనే హీరోయిన్లు జంకుతారని, క్రమశిక్షణ లేకపోతే ఆయన సెట్లోనే కొడతారని ప్రచారం ఉంది!. అయితే ఆ దర్శకుడిని ప్రశంసించింది నటి సదా. ఆయన సినిమా సెట్లో చాలా క్రమశిక్షణగా ఉంటారని, అలాంటి దర్శకుడిని ఇప్పటివరకూ చూడలేదని చెప్పింది. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఈ వారం అతిథిగా విచ్చేసిన సదా ఈ విషయాన్ని తెలిపింది.
"జనరల్‌గా హీరోయిన్స్‌కు పొద్దున్నే లేవడం, రావడం, రెడీ అవ్వడం, మేకప్, డ్రెస్సింగ్ చాలా టైమ్ పడుతుంది. ఏదో ఓ సినిమా షూటింగ్‌కు 2-3మినిట్స్ ఆలస్యమైంది. ఎవరు ఏమీ అనలేదు. కెమెరా ముందుకు రాగానే యాక్షన్ చెప్పగానే ఏడ్చింది. ఎవరు ఆ అమ్మాయి?" అని ఆలీ అడగగా.. "నేనే ఆ అమ్మాయి. తేజ గారి విషయం అందరికీ తెలుసు. ఆయన సినిమా సెట్లో చాలా క్రమశిక్షణగా ఉంటారు, అలాంటి దర్శకుడిని ఇప్పటివరకూ చూడలేదు" అని బదులిచ్చింది.
"ఎప్పుడైనా కొట్టారా ఆయన" అని ఆలీ మళ్లీ అడగగా.. "కొట్టలేదు. ఆయన ఎంత క్రమశిక్షణగా ఉంటారో నేను కూడా అంతే. అంత పరిస్థితిని నేను తీసుకురాలేదు. 'ఔనన్నా కాదన్నా' సినిమా షూటింగ్ ఓ గ్రామంలో చేశాం. హోటల్ నుంచి రెడీ అయి బయలుదేరితే గంటన్నర పడుతుంది. మూడు లేదా ఐదు నిమిషాలు ఆలస్యంగా సెట్‌కు వెళ్లా. అప్పటికే దర్శకుడు, డ్యాన్సర్ అందరు షూటింగ్ కోసం రెడీ అయిపోయారు. కెమెరా కూడా పెట్టేశారు. ఇక నేను కెమెరా ముందుకు వెళ్లా. ఎవరు ఏమీ అనలేదు. కానీ నా కోసం ఇంతమంది ఎదురుచూడటం వల్ల ఏడ్పు వచ్చేసింది. వారికి సారి చెప్పాను" అని వివరించింది సదా.
అలాగే, తన తల్లి క్యాన్సర్‌తో బాధపడిన రోజులను గుర్తుచేసుకుని కన్నీరుపెట్టుకుంది సదా. దానికి సంబంధించిన వీడియోను మీరు చూసేయండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సదా.. 2002లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'జయం' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ప్రాణం', 'జయం', 'నాగ'తో పాటు పలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ డ్యాన్స్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.
ఇదీ చూడండి: 'పదేళ్లు ప్రేమించా.. కానీ అతడు చేసిన పని..'