ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'అల వైకుంఠపురములో' టీజర్ వచ్చేసింది. బన్నీ స్టైల్, త్రివిక్రమ్ మాటల మాయాజాలం.. ఇందులో కనిపించాయి. హాస్యం, యాక్షన్, ఎమోషన్ తదితర అంశాలతో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. నివేదా పేతురాజ్ మరో కథానాయిక. సుశాంత్, నవదీప్, టబు, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.
'మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్లు దాచాడు నిన్ను.. సరిగా చూడలేదు ముందుకు రా', 'స్టైల్‌గా ఉంది కదా.. నాక్కుడా నచ్చింది', 'మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కాను' వంటి డైలాగ్‌లు అలరిస్తున్నాయి.
ఇప్పటికే వచ్చిన 'రాములో రాములా', 'సామజవరగమన' పాటలు రికార్డు బద్ధలు కొడుతూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఇప్పుడొచ్చిన టీజర్ ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">