హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన అత్తకు లేఖ రాయడంపై హర్షం వ్యక్తం చేశాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. నోలన్ దర్శకత్వం వహంచిన 'టెనెట్' సినిమాలో నటించింది అక్షయ్ అత్త డింపుల్ కపాడియా. ఈ సినిమా శుక్రవారం.. థియేటర్లలో విడుదలైన నేపథ్యంలో కపాడియాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశాడు నోలన్. ఈ ఉత్తరాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు అక్షయ్.
లేఖలో ఏముంది?
"డింపుల్.. మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. 'టెనెట్'లో మీరు నటించిన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. మీ పనితనానికి ధన్యవాదాలు." అని లేఖలో రాశాడు నోలన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆనందంలో అక్షయ్..
ఈ లేఖను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న అక్షయ్.. డింపుల్‌కు అల్లుడిని అయినందుకు గర్వంగా భావిస్తున్నా అని వెల్లడించాడు. 'టెనెట్'లో డింపుల్ నటించిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఈ సందర్భంగా నోలన్, డింపుల్ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.
ఇదీ చదవండి:'టెనెట్' సినిమాలో ఆఫర్.. ప్రాంక్ కాల్ అనుకున్నా!