ETV Bharat / sitara

ఫోర్బ్స్​ జాబితాలో అక్షయ్ కుమార్ ఒక్కడే - అక్షయ్ కుమార్ తాజా వార్తలు

ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న 100 మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్​ తాజాగా విడుదల చేసింది. ఇందులో చోటు దక్కించుకున్న అక్షయ్.. ఏకైక భారతీయ స్టార్​గా నిలిచాడు.

ఫోర్బ్స్​ జాబితాలో భారత్​ నుంచి అక్షయ్ ఒక్కడే
అక్షయ్ కుమార్
author img

By

Published : Jun 5, 2020, 3:55 PM IST

అత్యధిక పారితోషకం అందుకుంటున్న ఫోర్బ్స్-100 మంది​ సెలబ్రిటీల తాజా జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చోటు దక్కించుకున్నాడు. ఇందులోని ఏకైక భారతీయుడు ఇతడే కావడం విశేషం.

జూన్ 2019- మే 2020 మధ్య కాలంలో సంపాదించిన ఆదాయంను లెక్కించి, ఈ జాబితాను తయారు చేశారు. ప్రస్తుతం 52వ స్థానం సొంతం చేసుకున్న అక్షయ్, రూ.366 కోట్లు సంపాదించాడు. గతేడాదితో పోల్చితే 19 స్థానాలు దిగజారాడు. కరోనా ప్రభావమే ఈ హీరో ఆదాయం తగ్గడానికి ఓ కారణంగా కనిపిస్తోంది.

akshay kumar
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

ఈ జాబితాలో అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్(రూ.4,453 కోట్లు) తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత ర్యాపర్ కన్యా వెస్ట్, టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్, ఫుట్​బాల్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తదితరులు ఉన్నారు.

అక్షయ్ కుమార్.. ఈ మధ్య కాలంలో 'కేసరి', 'మిషన్ మంగళ్', 'గుడ్​న్యూస్', 'హౌస్​ఫుల్ 4'లతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 'లక్ష్మీబాంబ్', 'బచ్చన్​పాండే', 'బెల్​బాటమ్' తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.