బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, లారా దత్తా, హ్యూమా ఖురేషి, ఆదిల్ హుస్సెన్‌లు గురువారం ముంబయి విమానాశ్రయంలో తళ్లుక్కుమని మెరిశారు. వీరందరూ కలిసి 'బెల్‌బాటమ్' చిత్ర షూటింగ్ కోసం బ్రిటన్ బయలుదేరారు. గ్లాస్గో, స్కాట్లాండ్లో వీరు షూటింగ్ చేయనున్నారు. కరోనా వైరస్ భయాలను జయించి వీరందరూ కలిసి లాక్డౌన్ అనంతరం తొలిసారి షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు.
![Akshay, Lara and BellBottom team jet off to UK for shoot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/akshay_final_0608newsroom_1596713441_594.jpg)
అక్షయ్.. తన భార్య, నటి ట్వింకిల్ ఖన్నా, పిల్లలు ఆరవ్, నితారాతో కలిసి విమానం ఎక్కాడు. లారా వెంట భర్త, ప్రముఖ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, కుమార్తె సైరా ఉన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే వీరందరూ బ్రిటన్‌కు బయలుదేరారు.
![Akshay, Lara and BellBottom team jet off to UK for shoot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/lara_final_0608newsroom_1596713441_710.jpg)
![Akshay, Lara and BellBottom team jet off to UK for shoot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/huma_final_0608newsroom_1596713441_1045.jpg)
వాస్తవ సంఘటనలతో స్ఫూర్తిపొంది రూపొందిస్తున్న ఈ చిత్రం.. 1980 నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాకు రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో వానీ కపూర్ కీలక పాత్ర పోషించనుంది.
-
Taking off for Glasgow, #Scotland Now @CreativeScots @alangemmell
— Adil hussain (@_AdilHussain) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
to shoot. First Film Shoot during Covid19 #LockDown after Four months💥❤️ pic.twitter.com/Ru0oSzHBuO
">Taking off for Glasgow, #Scotland Now @CreativeScots @alangemmell
— Adil hussain (@_AdilHussain) August 6, 2020
to shoot. First Film Shoot during Covid19 #LockDown after Four months💥❤️ pic.twitter.com/Ru0oSzHBuOTaking off for Glasgow, #Scotland Now @CreativeScots @alangemmell
— Adil hussain (@_AdilHussain) August 6, 2020
to shoot. First Film Shoot during Covid19 #LockDown after Four months💥❤️ pic.twitter.com/Ru0oSzHBuO
ఇదీ చూడండి:- సినీకార్మికులకు అండగా దర్శకుడు రోహిత్‌శెట్టి