ETV Bharat / sitara

అతడిపై అక్షయ్​ రూ.500 కోట్ల పరువునష్టం దావా!

author img

By

Published : Nov 19, 2020, 1:26 PM IST

బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్,​ ఓ యూట్యూబర్​పై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. సుశాంత్​ కేసులో నటి రియా కెనడా పారిపోవడానికి అక్షయ్​ సహాయం చేశాడని సదరు యూట్యాబర్​ ఆరోపించిన నేపథ్యంలోనే ఈ కథానాయకుడు కోర్టును ఆశ్రయించారు.

Akshay Kumar's Rs 500 Crore Defamation Suit on YouTuber
యూట్యూబర్​పై అక్షయ్​ రూ.500 కోట్ల పరువునష్టం దావా

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ హత్య కేసులో నటి రియా చక్రవర్తి కెనడాకు పారిపోవడానికి అక్షయ్​ కుమార్​ సహాయం చేశాడని ఓ యూట్యూబర్​ ఆరోపించాడు. దీనిపై కోర్టును ఆశ్రయించిన అక్షయ్​.. యూట్యూబర్​ రషీద్​ సిద్దిఖీపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

ఇదే యూట్యూబర్​ సుశాంత్​ కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపైనా గతంలో ఆరోపణలు చేయగా.. పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్​పై తిరిగి బయటకు వచ్చాడు. అయితే ఈ కేసులో రియాకు అక్షయ్​ సహాయం చేస్తున్నాడని.. నటి కెనడా వెళ్లడానికి ఉద్ధవ్​, ఆదిత్యలతో అక్షయ్​ మంతనాలు జరిపాడని రషీద్ ఆరోపించాడు.

అసత్య వార్తలతో పెరిగిన సంపద

ధోనీ బయోపిక్​లో సుశాంత్​ నటించడం పట్ల అక్షయ్​ అసంతృప్తిగా ఉన్నాడని రషీద్ తెలిపాడు. ఈ కేసును అడ్డం పెట్టుకుని నాలుగు నెలల్లో సిద్దిఖీ సుమారు రూ.15 లక్షలను ఆర్జించాడని స్థానిక దినపత్రిక వెల్లడించింది. రషీద్​ యూట్యూబ్​ ఛానెల్​కు గత కొన్ని నెలల్లోనే లక్ష నుంచి 3.70 లక్షలకుపైగా సబ్​స్క్రైబర్లు పెరిగారు. మే నెలలో రూ.229 సంపాదించే రషీద్​.. సెప్టెంబరులో ఏకంగా 6,50,898 రూపాయలను ఆర్జించినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.