ETV Bharat / sitara

తాజ్​మహల్​ ముందు 'షాజహాన్​'గా అక్షయ్​

author img

By

Published : Dec 21, 2020, 3:43 PM IST

'అత్రాంగిరే' షూటింగ్​లో పాల్గొన్న బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​.. ఓ సరదా వీడియోను తన అభిమానుతో పంచుకున్నాడు. ఆ వీడియోలో.. తాజ్​ మహల్​ ముందు షాజహాన్​ వేషధారణలో గింగిరాలు తిరుగుతూ కనిపించాడు అక్షయ్​.

Akshay Kumar twirls in front of Taj Mahal dressed as Shah Jahan
తాజ్​ మహల్​ ముందు 'షాజహాన్​'గా అక్షయ్​

ఆనంద్ ఎల్​.రాయ్​ దర్శకత్వంలో అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​, ధనుష్​ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'అత్రాంగిరే'. ఈ సినిమా షూటింగ్​ ప్రస్తుతం ఆగ్రాలో తాజ్​ మహల్​ వద్ద జరుగుతోంది. తాజాగా.. షూటింగ్​లోని ​ ఓ సరదా వీడియోను అక్షయ్​ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశాడు. అందులో తాజ్​ మహల్​ ముందు షాజహాన్​ వేషధారణలో గిరిగరా తిరుగుతూ కనిపించాడు అక్షయ్​. ఈ స్లో మోషన్​ వీడియోను షేర్​ చేస్తూ 'వాహ్​ తాజ్'​ అని రాసుకొచ్చాడు.​

ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కుతున్న 'అత్రాంగిరే'లో సారా అలీ ఖాన్..​ బిహారి అమ్మాయి పాత్రలో కనువిందు చేయనుంది. ఆగ్రాలో షెడ్యూల్​ పూర్తి కాగానే.. మధురై, ముంబయి, దిల్లీలో ఈ సినిమా షూటింగ్​ జరుపుకోనుంది. జాతీయ అవార్డు గ్రహీత హిమాన్షు శర్మ కథ అందిస్తుండగా, ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2021 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి:'రామ్​ సేతు'తో అక్షయ్​ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.