బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్(akshay kumar new movie).. ఇప్పటికే విభిన్న జానర్స్‌లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దసరా సందర్భంగా శుక్రవారం ప్రకటించిన కొత్త సినిమాలో మేజర్ జనరల్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు 'గోర్ఖా' టైటిల్ పెట్టడమే కాకుండా ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు.
భారత ఆర్మీ మేజర్ ఇయాన్ కర్డోజో జీవితం ఆధారంగా ఈ సినిమాను(akshay kumar new movie) తెరకెక్కిస్తున్నారు. ఆయన పాత్రలో అక్షయ్ నటించనున్నారు. 1962, 1965 1971 ఇండో-పాక్ యుద్ధంలో మేజర్ ఇయాన్ భాగమయ్యారు. అత్యుత్తమ సేవలకుగాను ఈయన సేనా పతాకం కూడా అందుకుని ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్షయ్‌తో ఈయన అత్రంగీ రే, రక్షా బంధన్ సినిమాలు తీశారు. ఇప్పుడు రూపొందించే 'గోర్ఖా'(akshay kumar new movie) చిత్రానికి సంజయ్ సింగ్ పూరాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చదవండి: