ETV Bharat / sitara

వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్న అక్షయ్​కుమార్

author img

By

Published : Jun 22, 2020, 10:16 AM IST

గతంలో తనను వెళ్లగొట్టిన చోటే, ప్రస్తుతం బంగ్లా కొనుగోలు చేసి అందులోనే ఉంటున్నానని హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ నటుడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొనుక్కున్న అక్షయ్ కుమార్
హీరో అక్షయ్ కుమార్

32 ఏళ్ల క్రితం తనను ఎక్కడి నుంచైతే వెళ్లగొట్టారో సరిగ్గా అదే చోట ఓ బంగ్లా కొనుగోలు చేసి, ప్రస్తుతం నివసిస్తున్నానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

అసలేం జరిగింది?

బాలీవుడ్​లోకి అడుగుపెట్టకముందు తాను ముంబయిలో ఓ ఫొటోగ్రాఫర్​ దగ్గర సహాయకుడిగా పనిచేసేవాడినని చెప్పారు అక్షయ్. అయితే 4-5 నెలలు జీతానికి బదులుగా తనకు ఫొటోషూట్​ చేసిపెట్టమని ఆయన్ని అడిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జుహూ బీచ్​ దగ్గర్లని ఓ బంగ్లాను చూశారు. దాని పిట్టగోడపై అక్షయ్ ఉండగా, నాలుగైదు ఫొటోలు తీశారు. ఇంతలో వాచ్​మన్ వచ్చి వారిని వెళ్లగొట్టాడు. అయితే ఇప్పుడు సరిగ్గా అదే చోట కట్టిన బంగ్లాలో తాను ఉంటున్నట్లు అక్షయ్ తెలిపారు. ఈ సందర్భంగా పాత, కొత్త ఫొటోలను కలిపి చూపించారు. ఈ విషయమై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అక్షయ్ నటించిన 'లక్ష్మీబాంబ్' విడుదల కావాల్సి ఉంది. దీంతో పాటే 'బచ్చన్ పాండే', 'బెల్ బాటమ్' రీమేక్​తో పాటు 'పృథ్వీరాజ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ కథానాయకుడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.