పోలీసుల పట్ల మరోసారి మంచిమనసు చాటుకున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. కరోనా వైరస్ లక్షణాలను పసిగట్టే 500 మోచేతి బ్యాండ్లను, పంజాబ్‌లోని జలంధర్ పోలీస్ బృందానికి విరాళంగా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రతలను కూడా ఈ పరికరం తెలియజేస్తుంది. ఇటీవల ముంబయి పోలీసులకు ఇలాంటివే 1000 బ్యాండ్లను అందించారు.
దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అక్షయ్ తన వంతు ఆర్థిక సాయం చేయడం సహా వైరస్‌పై పోరాటం చేస్తున్న యోధులకు అండగా నిలుస్తూనే ఉన్నారు. వారికి భారీ మొత్తంలో విరాళాలు, కనీస సౌకర్యాలు అందించడం చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 25కోట్లు , ముంబయి మున్సిపల్ కార్పోరేషన్లకు రూ.3 కోట్ల విరాళాలిచ్చారు అక్షయ్ కుమార్.
ఇది చూడండి : పోలీస్ ఫౌండేషన్‌కు అక్షయ్ కుమార్ భారీ విరాళం