ETV Bharat / sitara

బుల్లెట్​ స్పీడ్​లో అక్షయ్.. ఒకేసారి 9 చిత్రాలు! - అత్రాంగి రే

బాలీవుడ్ స్టార్ అక్షయ్​ కుమార్​ దూకుడు మామూలుగా లేదు. ఏ స్టార్​కూ లేనన్ని సినిమాలు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 9 సినిమాల్లో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందామా..?

akshay kumar
అక్షయ్​ కుమార్
author img

By

Published : Nov 14, 2021, 11:38 AM IST

బాలీవుడ్ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్ స్పీడు మామూలుగా లేదు. కరోనా కాలంలోనే 'లక్ష్మీ బాంబ్', 'బెల్​ బాటమ్'​ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు ఏకంగా 9 సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన 'సూర్యవంశీ' ఇటీవల థియేటర్​లలో విడుదలైంది. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకొన్ని సెట్స్​పై ఉండగా.. మరికొన్నింటికి కమిట్​ అయ్యారు అక్కీ భాయ్​.

బచ్చన్ పాండే..

.
.

అక్షయ్ కుమార్ గ్యాంగ్​స్టర్​ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'బచ్చన్​పాండే'(BachchanPandey) ఇటీవల ఈ చిత్రం చివరి షెడ్యూల్​ మొదలుపెట్టేశారు. 200 మంది ఆర్టిస్టులతో ఓ సినిమా హాల్​లో షూటింగ్ జరిగింది. ఈ చిత్రంలో కృతిసనన్(krithi sanon), జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్​స్టర్ డ్రామా కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు.

పృథ్వీరాజ్..

.
.

అక్షయ్​కుమార్​ నటించిన 'పృథ్వీరాజ్'​ సినిమా నవంబరు 5న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇందులో అక్షయ్​తో పాటు మానుషీ చిల్లర్​, సంజయ్​ దత్​, సోనూ సూద్​ నటించారు. చంద్రప్రకాశ్​ ద్వివేది దర్శకత్వం వహించారు.

ఆకాశం నీ హద్దురా.. రీమేక్​లో

.
.

తమిళ నటుడు సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సూరారై పోట్రు'. తెలుగులో ఈ సినిమా 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైంది. ఎయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్​లోకి తీసుకెళ్లేందుకు అక్షయ్ సిద్ధమైనట్లు సమాచారం.

మరోసారి శివుడిగా..

అక్షయ్​కుమార్​, పరేశ్​ రావల్​, మిథున్​ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్​ బస్టర్​ మూవీ 'ఓ మై గాడ్'(akshay kumar oh my god 2)​. దీనికి సీక్వెల్​గా 'ఓ మై గాడ్​ 2' రూపొందుతోంది. ఇందులో అక్షయ్​ మరోసారి దేవుడి పాత్రలో(పరమేశ్వరుని) కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

అత్రాంగి రే..

.
అత్రాంగి రే

బాలీవుడ్ సూపర్​ స్టార్​ అక్షయ్​ కుమార్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న 'అత్రాంగి రే'(akshay kumar new movie) సినిమా షూటింగ్ ఇటీవల ​ పూర్తైంది. ఏఆర్​ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు ధనుష్​ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆనంద్​ ఎల్​.రాయ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.

రక్షా బంధన్​..

.
.

అన్నా చెల్లెల్ల బంధానికి ప్రతీకగా నిలిచే కథతో ఈ సినిమా తీస్తున్నారు అక్షయ్​(akshay kumar new movie). తన కెరీర్​లో అత్యంత వేగంగా ఒప్పుకొన్న చిత్రమిదని అక్షయ్ చెప్పారు. ఆనంద్ ఎల్ రాయ్ దీనికి దర్శకుడు. ఈ సినిమా నవంబరు 5న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది.

రాక్షసుడు రీమేక్​లో..

.
.

'రాక్షసుడు' హిందీ రీమేక్​లో అక్షయ్ కుమార్(akshay kumar new movie)​ నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో ఈ చిత్రానికి రమేశ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన రవితేజతో 'కిలాడీ' చిత్రం చేస్తున్నారు. కిలాడీ సినిమా పూర్తైన వెంటనే.. షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

రామ్​సేతు..

.
.

అక్షయ్ చేస్తున్న ఆసక్తికర సినిమా 'రామ్​ సేతు'(akshay kumar new movie). నిజమా? కల్పన? అనే ట్యాగ్​లైన్​తో చిత్రం రూపొందుతోంది. 'రామ్​సేతు' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకుడు.

'గోర్ఖా'లో ఆర్మీ మేజర్​గా..

.
.

అక్షయ్ కుమార్ ఆర్మీ మేజర్​గా నటిస్తున్న చిత్రం 'గోర్ఖా'. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్​లుక్​ను ఇప్పటికే విడుదల చేశారు. భారత ఆర్మీ మేజర్ ఇయాన్​ కర్డోజో జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1962, 1965, 1971 ఇండో- పాక్ యుద్ధంలో మేజర్ ఇయాన్​ భాగమయ్యారు. ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్షయ్​తో ఈయన అత్రంగీ రే, రక్షా బంధన్​ సినిమాలు తీశారు. ఇప్పుడు రూపొందించే 'గోర్ఖా'(akshay kumar new movie) చిత్రానికి సంజయ్ సింగ్ పూరాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: నటనలోనే కాదు.. పెయింటింగ్​లోనూ టాపే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.