ETV Bharat / sitara

విజయ్ సినిమాలో నటించి తప్పుచేశా! - thuppaki sequel

'తుపాకీ' సినిమాలోని చిన్న పాత్ర చేసినందుకు చింతిస్తున్నానని చెప్పింది నటి అక్షర గౌడ. అయినాసరే వారిపై ఎలాంటి కోపం లేదని తెలిపింది.

'విజయ్ సినిమాలో నటించి తప్పుచేశా'
నటి అక్షర గౌడ
author img

By

Published : Jul 13, 2020, 10:23 AM IST

Updated : Jul 13, 2020, 11:39 AM IST

కోలీవుడ్​ హీరో విజయ్ 'తుపాకీ' సినిమాలో చిన్న పాత్రలో నటించి తప్పుచేశానని అంటోంది నటి అక్షరగౌడ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించింది. నిజానికి తాను హీరోయిన్​ కాజల్ స్నేహితురాలి పాత్ర పోషించాల్సిందని తెలిపింది.

"తుపాకీ సినిమాలో మంచి విషయం ఏదైనా ఉందంటే అది విజయ్​, మురగదాస్​ సర్, సంతోష్ శివన్ ​సర్. ఇది కాకుండా మరేం లేదు. నేను చేసిన పాత్ర వల్ల చింతిస్తున్నాను. నిజానికి కాజల్ స్నేహితురాలి పాత్ర​ కోసం నన్ను సంప్రదించారు. కానీ తర్వాత మార్చేశారు. అయినాసరే నాకెలాంటి కోపం లేదు. ఒకవేళ ఆ చిత్రయూనిట్.. మరో సినిమా కోసం ఇప్పుడు పిలిచానా సరే పనిచేస్తా"

-అక్షర గౌడ, నటి

Akshara Gowda
నటి అక్షర గౌడ

ఆర్మీ నేపథ్య కథతో తెరకెక్కిన 'తుపాకీ'(2012).. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపు తీసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు మురగదాస్. కథా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్.. 'మాస్టర్' సినిమా చేస్తున్నారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 13, 2020, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.