ETV Bharat / sitara

'నాగార్జునను కొట్టడం అభిమానులకు నచ్చలేదు' - entertainment news

కథానాయకుడు సుమంత్.. తన కెరీర్​లో ఓ రెండు సినిమాలు చేసుండాల్సింది కాదని అన్నాడు. మామ నాగార్జునతో కలిసి నటించాల్సి ఉండకూడదని చెప్పాడు.

'మామ నాగార్జునను కొట్టడం అభిమానులకు నచ్చలేదు'
హీరో సుమంత్
author img

By

Published : Apr 14, 2020, 11:23 AM IST

టాలీవుడ్​ హీరో సుమంత్.. తన సినీ కెరీర్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మామ నాగార్జునతో కలిసి 'స్నేహమంటే ఇదేరా!' చిత్రంలో నటించి ఉండకూడదని అన్నాడు. వీటితో పాటే మరికొన్ని విషయాలు పంచుకున్నాడు.

sumanth  Nagarjuna
'స్నేహమంటే ఇదేరా' సినిమాలో నాగార్జున-సుమంత్

''స్నేహమంటే ఇదేరా'లో నటించి, తప్పు చేశాను. చినమామ నాగార్జున, నేను.. స్నేహితులుగా కనిపించడం, అభిమానులు నచ్చలేదు. ఇందులోని ఓ సన్నివేశం​లో మామను కొట్టడం ఫ్యాన్స్​కు రుచించలేదు. స్క్రిప్ట్​లోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా 'పెళ్లి సంబంధం' చిత్రం.. కెరీర్​లో నేను చేసిన ఓ తప్పు. తాత అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు కోసమే దానిని ఒప్పుకున్నా. ఆ స్క్రిప్ట్​లోనూ కొన్ని సమస్యలున్నాయి. ఈ రెండూ సినిమాలు నన్ను తీవ్రంగా నిరాశపర్చాయి' -సుమంత్, కథానాయకుడు

ప్రస్తుతం ఇతడు 'కపటధారి' అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కన్నడ థ్రిల్లర్ 'కవాలుదారి'కి రీమేక్ ఇది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతమేర చిత్రీకరణ జరిగింది. కరోనా కారణంగా ప్రస్తుతం అది నిలిచిపోయింది.

kapatadhari poster
కపటధారి పోస్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.