ETV Bharat / sitara

'ఆ సినిమా కోసం తమన్​కు​ లంచం ఇచ్చా'​

హాలీడే టూర్​కు ఎక్కడికైనా వెళ్లాలంటే తన అన్నయ్య నాగచైతన్యను ఒప్పించడం చాలా కష్టమని అంటున్నారు యువ కథానాయకుడు అఖిల్​. అలాగే తన వదిన సమంత ఓ ర్యాగింగ్​ మాస్టర్​ అంటూ.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా కబుర్లను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విషయాలేంటో ఆయన మాటల్లోనే వినేద్దాం.

Akkineni Akhil Special Interview
'ఆ సినిమా కోసం తమన్​కు​ లంచం ఇచ్చా'​
author img

By

Published : Feb 7, 2021, 10:36 AM IST

అఖిల్‌.. 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'గా త్వరలో తెరమీద మళ్లీ సందడి చేయబోతున్న అక్కినేని నట వారసుడు. వైఫల్యాలను అధిగమిస్తూనే సినీ రంగంలో తనదైన ముద్రవేస్తున్న ఈ మన్మథ కుమారుడు.. తన మనసులోని ముచ్చట్లను చెప్పుకొస్తున్నాడిలా..

మొదటిసారి పాట పాడా..

'హలో' సినిమాలో 'ఏవేవో కలలు కన్నా' పాడే అవకాశం అనుకోకుండానే వచ్చింది. అనూప్‌ రూబెన్స్‌ ఆ సినిమా పాటలకు సంగీతం సమకూరుస్తున్నప్పుడు నేను అతని పక్కనే ఉండేవాడిని. ఓ రోజు 'ఏవేవో' పాట అయ్యాక నన్నోసారి సరదాగా పాడమనడం వల్ల ప్రయత్నించా. అతనికి నా గొంతు నచ్చి సినిమాలోనూ పాడమని బలవంతం చేశాడు. అయితే.. నేను నెలరోజులు ఆ పాటను ప్రాక్టీస్‌ చేసి.. నాకు నమ్మకం కుదిరిందనుకున్నాకే రికార్డింగ్‌కు వెళ్లా. మొత్తానికి అది బాగానే వచ్చింది.

ఇష్టమైన నటులు

ఇంకెవరూ.. మా నాన్నే. ఆ తర్వాత హృతిక్‌రోషన్‌ అంటే ఇష్టం.

ఆ పాటకు చాలా కష్టపడ్డా

ఓసారి నేను వ్యాయామం చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో పెడితే.. దాన్ని చూసిన శేఖర్‌ మాస్టర్‌ 'నువ్వు 8 ప్యాక్‌ సాధించు.. మిస్టర్‌ మజ్నూ టైటిల్‌సాంగ్‌కు మంచి డ్యాన్స్‌ కంపోజ్‌ చేస్తా' అన్నాడు. ఆ 8ప్యాక్‌కోసం మూడునెలలు విపరీతంగా కష్టపడ్డా. ఓ పక్క వ్యాయామాలూ, మరోపక్క షూటింగ్‌తో విశ్రాంతి లేక అసహనంగా అనిపించేది. దాంతో ఇంటికొచ్చాక ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇంట్లోవాళ్లూ నన్ను పలకరించేవారు కాదు. ఆ పాట పూర్తయ్యాకే మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టా.

వైజాగ్‌ బీచ్‌ నచ్చుతుంది

నేను ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాలంటే బీచ్‌లే. ఆ ఇష్టంతోనే ఇప్పటివరకూ చాలా బీచ్‌లను చూశా. కానీ.. అన్నింట్లోకీ వైజాగ్‌ బీచ్‌ ఎక్కువగా నచ్చుతుంది. దానికీ మా కుటుంబానికీ విడదీయరాని అనుబంధం ఉందనిపిస్తుంది. అవకాశం వస్తే.. ఆ బీచ్‌లో వీలైనంత ఎక్కువసేపు గడిపేందుకు ప్రయత్నిస్తా.

అన్నను ఒప్పించలేం

ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు.. ఇంట్లో చర్చ జరగడం మామూలే. అయితే ఫలానా చోటుకు వెళ్లాలని అందరినీ ఒప్పించొచ్చు కానీ అన్నయ్యను మాత్రం అంత తేలిగ్గా ఒప్పించలేం. తనకంటూ కొన్ని ప్లాన్స్‌ ఉంటాయి. ఓ స్పష్టమైన ఆలోచన ఉంటుంది. దాంతో ఏదీ అంత సులువుగా ఒప్పుకోడు. తను మెంటల్లీ బాగా స్ట్రాంగ్‌.

క్రికెట్‌ బ్యాట్‌ లంచంగా ఇచ్చా

తమన్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి. దాంతో మంచి పాటలు చేస్తే.. క్రికెట్‌బ్యాట్‌ ఇస్తానని తరచూ చెప్పే వాడిని. అలా ఓ సినిమాకు అతనికి క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సంతకం చేసిన బ్యాట్‌ను ఇచ్చా. దాన్ని చూసి ఎంత ఆనందించాడో చెప్పలేను.

ఇష్టపడే ఆహారం

ఫిష్‌ఫ్రై. తీపి పదార్థాల్లో అయితే ఐస్‌క్రీం.

నచ్చే రంగులు

తెలుపు, నలుపు, నీలం.

మంచి ఫ్రెండ్‌

సమంతను వదిన అనడం కన్నా.. మంచి ఫ్రెండ్‌గా భావిస్తా. ఎలాంటి సమయంలోనైనా ఉత్సాహంగా, అందరినీ నవ్విస్తూ ఉంటుంది. నవ్వుతూనే ఆటపట్టిస్తుంది. అందుకే ఆమెను ర్యాగింగ్‌ మాస్టర్‌ అంటూంటా.

నన్ను నేను విమర్శించుకుంటా

మా అమ్మ తనని తాను ఎప్పుడూ ఆత్మపరిశీలన చేసుకుంటుంది. అమ్మ నుంచి నాకూ ఆ అలవాటు వచ్చింది. ఒక సినిమా అయ్యాక అందులో నేను నటించిన విధానం, చేసిన పొరపాట్లను బేరీజు వేసుకుని నన్ను నేను విమర్శించుకుంటా. వాటిని బట్టి నా తర్వాతి సినిమాలో ఆ తప్పులు మళ్లీ ఎదురుకాకుండా చూసుకుంటా.

ఇదీ చూడండి: ఆ ముగ్గురిలో విజయ్​తో నటించేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.