వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నారు టాలీవుడ్ యువ కథనాయకుడు రామ్ పోతినేని(Ram potineni).. కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో(Linguswamy) తన కొత్త చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు. కృతి శెట్టి(Krithi Shetty) కథానాయిక. నేటి (సోమవారం) నుంచి చిత్రీకరణ ప్రారంభించినట్లు చిత్రబృందం ప్రకటించింది.
చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల సినీ కార్యకలాపాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడం వల్ల సినిమాను పట్టాలెక్కించారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా పేరును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
'ఏజెంట్' షురూ
సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో అక్కినేని అఖిల్ 'ఏజెంట్'(Agent) సినిమా చేస్తున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా కోసమే అఖిల్ (Akhil Akkineni) జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమాలోని అఖిల్ సిక్స్‌బాడీ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసి.. నేటి(సోమవారం) నుంచి షూటింగ్ మొదలుపెట్టినట్లు కూడా వెల్లడించింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా బీస్ట్ లుక్‌లో అభిమానులను అలరించేందుకు అఖిల్ సిద్ధమయ్యారు. ఇలాంటి దేహం కోసం తాను 365 రోజులు కష్టపడినట్లు అఖిల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన అఖిల్ జిమ్ లుక్.. అభిమానుల్ని విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య(Sakshi Vaidya) కథానాయిక.
ఇదీ చూడండి.. 'రామారావు'గా రవితేజ.. బాలీవుడ్‌కు 'ఆకాశం నీ హద్దురా'