Akhanda pre release event: Akhanda pre release event: బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'అఖండ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగింది. అల్లు అర్జున్, దర్శకధీరుడు రాజమౌళి ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరింగింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 'జై బాలయ్య' సాంగ్‌ను జక్కన్న విడుదుల చేయగా.. అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ప్రపంచమే గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి, అల్లు అర్జున్, నా అభిమానులు, ప్రేక్షకులందరు సహా ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్'తోనే అర్థమైపోయి ఉంటుంది. అయితే అఖండకు మరో ప్రత్యేకత ఉంది. ఈ సినిమా మరో లెవల్. అల్లు అర్జున్ చెప్పినట్లే తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించినంతగా ఇంకెవరూ ఆదరించలేరు. మీ అభిమానాన్ని సొంతం చేసుకోవడం మా పూర్వ జన్మ సుకృతం. అల్లు కుటుంబానికి, నందమూరి కటుంబానికి మంచి అనుబంధం ఉంది. ప్రగ్యా, పూర్ణ, శ్రీకాంత్ అందరూ బాగా నటించారు. మా సినిమాతో పాటు 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'ఆచార్య' సహా మిగతా చిన్న సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. తెలుగు ప్రభుత్వాలు కూడా చిత్రసీమకు పూర్తి సహాయసహకారాలు అందించాలి" అని అన్నారు.
"ముందుగా ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అల్లు అర్జున్, రాజమౌళి, నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. బాలయ్య ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీరు తెరపై చూస్తారు. బాలయ్య చేతికి దెబ్బ తగలడానికి నేనే కారణం. 'జై బాలయ్య' సాంగ్‌కు ప్రాక్టీస్ చేయడం జరిగింది. అది ప్రాక్టీస్ చేసేటప్పుడు బాడీ పెయిన్స్ రావడం సహజం. ఆ నొప్పులు తగ్గడానికి చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఇంటికి వెళ్లిన బాలయ్య అది చేసేటప్పుడు కాలు జారి పడ్డారు. నేనేమో 'జై బాలయ్య' పాట కోసం కోటిన్నర ఖర్చు పెట్టి సెట్ రెడీ చేశాను. బాలయ్య పడ్డాడు అనగానే నా గుండె జారింది. పాట ఆపేద్దాం అనుకున్నా. అయినా పట్టుదలతో ఫ్యాన్స్ కోసం ఆయన చేస్తానన్నారు. అలా 'జై బాలయ్య' సాంగ్‌లో దెబ్బ తగ్గకుండానే కట్టు కట్టుకుని డ్యాన్స్ వేశారు. ఇక నా కెరీర్ విషయాని కొస్తే నేను ఎదగడానికి బన్నీ, బాలయ్యయే కారణం. వారికి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు చెబుతున్నా"
-బోయపాటి, దర్శకుడు.
"సరైనోడు తర్వాత నాకు మంచి పాత్ర ఇస్తానని బోయపాటి చెప్పారు. అది కూడా విలన్ క్యారెక్టర్ అన్నారు. నాకు నమ్మ బుద్ధి కాలేదు. కానీ, 'అఖండ'లో వరదరాజు పాత్ర చెప్పిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. నా పాత్రకు సంబంధించిన గెటప్ కోసం బోయపాటి చాలా కష్టపడ్డారు. షూటింగ్‌కు వెళ్లిన మొదటిరోజే బాలకృష్ణతో నటించే అవకాశం వచ్చింది. మొదట కాస్త భయపడ్డాను. బాలకృష్ణ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ సినిమాతో మీరొక కొత్త శ్రీకాంత్‌ను చూస్తారు. డిసెంబరు 2న థియేటర్‌లలో దబిడి దిబిడే."
-శ్రీకాంత్, నటుడు.
బాలయ్య లాంటి నటుడిని చూడలేదు
"నేను చాలా మంది ఆర్టిస్ట్‌లతో పనిచేశాను. కానీ ఎప్పుడూ ఎనర్జీతో ఉంటూ, తోటి నటీనటుల పట్ల వినయంగా ఉండే బాలకృష్ణలాంటి నటుడిని చూడలేదు. బాలకృష్ణతో పనిచేయడం నా గాడ్‌ఫాదర్‌తో పనిచేసినట్లు ఉంది. బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా క్లాస్‌లు చెప్పవచ్చు."
-నటి పూర్ణ.
బాలయ్య స్ఫూర్తి..
"అందరికీ నమస్కారం 'జై బాలయ్య'. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. 'అఖండ' సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నన్ను ఈ సినిమా కోసం ఎంపికచేసినందుకు ధన్యవాదాలు. బాలకృష్ణ ఎంతో పాజిటివ్, ఎనర్జీగా ఉంటారు. ఆయన ఓ స్ఫుర్తి. అల్లు అర్జున్, రాజమౌళికి ప్రత్యేక ధన్యవాదాలు. చిత్రబృందానికి కృతజ్ఞతలు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను."
-ప్రగ్యా జైశ్వాల్.
ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా హీరోయిన్గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: బాలయ్య ఓ ఆటమ్ బాంబు: రాజమౌళి