ETV Bharat / sitara

'అఖండ' రిలీజ్​కు వేళాయే.. ఎక్కడ చూసినా బాలయ్య మాస్ - అఖండ మూవీ రివ్యూ

akhanda movie tickets: నందమూరి బాలకృష్ణ ప్రధాన కథానాయకునిగా తెరకెక్కుతున్న 'అఖండ' చిత్రం గురువారం(డిసెంబరు 2) ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ క్రమంలో బెనిఫిట్​ షోల ప్రదర్శనకు నగరంలోని రెండు థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కూకట్‌పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లకు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది.

akhanda movie tickets
అఖండ మూవీ టికెట్స్
author img

By

Published : Dec 1, 2021, 10:05 PM IST

akhanda movie release: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అఖండ' చిత్రం గురువారం(డిసెంబరు 2)న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. 'సింహా', 'లెజెండ్'​ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్​లో వస్తున్న చిత్రం కావడం వల్ల అభిమానుల అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. నందమూరి నటసింహ పవర్​పుల్ డైలాగ్​ల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బెనిఫిట్​ షోల ప్రదర్శనకు నగరంలోని రెండు థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కూకట్‌పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లకు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఈ స్పెషల్‌ షోలకు టికెట్‌ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉదయం 4: 30 గంటలకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు.

akhanda movie tickets
అఖండ మూవీ

ఇదీ చదవండి:'అఖండ' రిలీజ్​కు రెడీ.. 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్ సాంగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.