ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆకాశవాణి'. ఈ సినిమా కోసం తొలిసారి స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పారాయన. ఈ చిత్ర టీజర్‌ను మార్చి 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
![akasavani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10828758_asdsdf-4.jpg)
మహేశ్ నారాయణ్ తెరకెక్కించిన 'మాలిక్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
![malik](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10828758_asdsdf-3.jpg)
తమిళ హీరో ధనుశ్ నటించిన 'కర్ణన్' సినిమాలోని రెండో సింగిల్‌ను మార్చి 2వ తేదీ సాయంత్రం 5.03గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.
![karnan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10828758_asdsdf-2.jpg)
ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తున్న తమిళ సినిమా 'ఆనందం విలయడుమ్ వీడు'కు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా.. సినిమా విజయవంతం కావాలంటూ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు రాజశేఖర్.
![anandam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10828758_asdsdf-1.jpg)
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ఇదే మా కథ'. ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ గొల్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 'ప్రియ ప్రియ' లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'వైల్డ్ డాగ్' రిలీజ్ ఫిక్స్.. 'దృశ్యం 2' షురూ
ఇదీ చూడండి: 'ఆచార్య' చెర్రీ లుక్-సుధీర్ కొత్త సినిమా టైటిల్ ఖరారు