ETV Bharat / sitara

అభిమానులకు నిరాశ.. 'వాలిమై' ఫస్ట్​లుక్​ వాయిదా - Ajith Valimi

కరోనా పరిస్థితుల వల్ల తమిళ హీరో అజిత్​ నటిస్తున్న 'వాలిమై' సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేయట్లేదని ఓ ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఎప్పటినుంచో దీని కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశకు గురయ్యారు.

Valimi
వాలిమై
author img

By

Published : Apr 24, 2021, 3:26 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్‌ రెండోదశ విలయతాండవం చేస్తోన్న తరుణంలో సినీ పరిశ్రమలో మరోసారి వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్‌, విడుదలలు వాయిదా వేశారు. మరోవైపు మరికొన్ని చిత్రాలు అప్రమత్తత, జాగ్రత్తల నడుమ షూటింగ్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అజిత్‌ అభిమానులకు నిరాశ కలిగించే ఓ ప్రకటన బయటకు వచ్చింది.

అజిత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'వాలిమై'. సూపర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజిత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని మే 1న వాలిమై ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తానని అప్పట్లో చిత్రబృందం ప్రకటించింది. కాగా, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని పేర్కొంది.

గని కూడా..

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న గని చిత్రీకరణ నిలిచిపోయింది. వైరస్‌ విజృంభణతో కొంతకాలంపాటు షూట్‌ను వాయిదా వేస్తున్నట్లు వరుణ్‌తేజ్‌ తెలియజేశారు. పరిస్థితులు కొంతమేర చక్కబడితే త్వరలోనే సెట్‌లోకి తిరిగి అడుగుపెడతామని ఆయన అన్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఉపేంద్ర, సునీల్‌శెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.