తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న హీరో అజిత్. ఈ ఏడాది 'విశ్వాసం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ ఇప్పుడు గెటప్ మార్చాడు. క్లీన్ షేవ్‌తో ట్రెండీ లుక్‌లో దర్శనమిస్తూ.. అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
ఎప్పుడూ తెల్లటి గడ్డం, నెరిసిన జుట్టుతో కనిపించే అజిత్.. సహజంగా ఉండటమే ఇష్టమంటూ ఇదే లుక్‌లో కనిపిస్తుంటాడు. కథలు వైవిధ్యంగా ఉన్నా.. ఒకే తరహా గెటప్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. ఇప్పుడు గెటప్ మార్చి డీసెంట్ హెయిర్ కట్‌తో సందడి చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈయన బోనీ కపూర్ నిర్మాణంలో వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అజిత్‌ను యంగ్‌లుక్‌లో చూపించేలా ప్రయత్నిస్తున్నాడట దర్శకుడు.
ఇది చదవండి: మహేశ్ కోసం 'కొండారెడ్డి బురుజు' మరోసారి..!