ETV Bharat / sitara

Ajith Kumar Valimai: కరోనా దెబ్బకు 'వలిమై' కూడా వాయిదా - కరోనా

Ajith Kumar Valimai: దేశంలో కరోనా దెబ్బకు మరో సినిమా వాయిదా పడింది. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' రిలీజ్​ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Ajith Kumar Valimai
వలిమై
author img

By

Published : Jan 6, 2022, 7:47 PM IST

Ajith Kumar Valimai: తమిళ స్టార్​ హీరో అజిత్ కుమార్ నటించిన 'వలిమై' వాయిదా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 13న విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు గురువారం ప్రకటించారు. కరోనా దెబ్బకు ఇప్పటికే 'ఆర్​ఆర్ఆర్'​, షాహిద్ కపూర్​ 'జెర్సీ', ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలు వాయిదా పడగా.. ఈ జాబితాలో 'వలిమై' కూడా చేరినట్లైంది. దీంతో ఈ సంక్రాంతికి ఎలాగైనా తమ హీరోలను థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్​కు మరోసారి నిరాశే మిగిలింది.

Ajith Kumar Valimai
'వలిమై' వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

'వలిమై'లో అజిత్ పోలీస్ అధికారి పాత్రలో నటించగా, తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్​గా అలరించనున్నారు. ఈ మూవీకి హెచ్​ వినోద్​ దర్శకత్వం వహించగా.. హ్యుమా ఖురేషి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చారు. బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మించారు.

ఇదీ చూడండి: మూడు సినిమాలు, ఆరు టికెట్లు అనుకుంటే.. నిరాశే మిగిలెనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.