ETV Bharat / sitara

గల్వాన్ ​ఘటనపై అజయ్​ దేవగణ్​ సినిమా - గల్వాన్​ఘటనపై అజయ్​ సినిమా

గల్వాన్​ ఘర్షణ నేపథ్యంలో బాలీవుడ్​లో ఓ సినిమా తెరకెక్కనుంది. స్టార్​ హీరో అజయ్​ దేవగణ్​ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

azay
అజయ్​
author img

By

Published : Jul 4, 2020, 11:38 AM IST

జూన్​ 15న తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ లోయ వద్ద భారత్​-చైనా బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత వీరులు అమరులైన ఘటన యావత్తు దేశాన్ని కలిచివేసింది. అయితే తాజాగా ఇదే కథాంశం నేపథ్యంలో త్వరలోనే బాలీవుడ్​లో సినిమా తెరకెక్కనుంది. స్టార్​ హీరో అజయ్​ దేవగణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అజయ్​ దేవగణ్​ ఎఫ్​ఫిల్మ్స్​​, సెలెక్ట్​ మీడియా హోల్డింగ్​ ఎల్​ఎల్​పీ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

"మొక్కవోని ధైర్యసాహసాలతో చైనీయులను వెనక్కు తరిమికొట్టిన మన భారత సైన్యంలోని అమరులైన 20మంది జవాన్ల త్యాగాలు, వీరత్వం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం."

-అజయ్ ​దేవగణ్​ ఎఫ్​ ఫిల్మ్స్​.

అయితే ఇందులో అజయ్​ నటిస్తున్నారా, లేదా? అనేది స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపింది చిత్రబృందం.

త్వరలో అజయ్​ 'భుజ్​ : ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డిస్నీ ప్లస్ హాట్​స్టర్​లో ఈ చిత్రం విడుదల కానుంది. సంజయ్​ దత్​, సోనాక్షి సిన్హా, శరద్​ కేల్కర్ ఈ చిత్రంలో​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో సినిమా 'మైదాన్'​లోనూ నటిస్తున్నారు అజయ్.

ఇది చూడండి : 'నిద్ర లేస్తే ఆలోచనంతా నీ గురించే సుశాంత్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.