బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. ఇటీవలే 'తానాజీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతూ అలరిస్తోందీ చిత్రం. ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే 'మైదాన్' చిత్రీకరణలో పాల్గొంటున్నాడీ నటుడు. ఈరోజు సినిమాకు సంబంధించిన టీజర్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు అజయ్.
ఇందులో కొంతమంది అబ్బాయిలు.. బురదతో ఉన్న మైదానంలో ఫుట్‌బాల్ పట్టుకుని కనిపించారు. క్రీడాకారుల కాళ్లు మాత్రమే చూపించి, సినిమాపై అంచనాల్ని పెంచేసింది చిత్రబృందం.

ఇదీ చదవండి: 'కేజీఎఫ్-2' ముగింపు రామోజీ ఫిల్మ్‌సిటీలోనే!