ETV Bharat / sitara

రోడ్​సైడ్​ దోశ వేసిన ప్రముఖ హీరోయిన్​ - ఐశ్వర్య రాజేశ్​ గుడ్డు దోశ వేస్తున్న వీడియో వైరల్​

'కౌసల్య కృష్ణమూర్తి' ఫేమ్​ ఐశ్వర్యా రాజేశ్​ రోడ్డు పక్క టిఫిన్​ బండిపై ఎగ్ దోశ వేస్తున్న వీడియోను ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

Aishwarya Rajessh
రోడ్​సైడ్​ దోశలు వేస్తున్న ప్రముఖ హీరోయిన్​
author img

By

Published : Mar 6, 2020, 6:58 PM IST

Updated : Mar 6, 2020, 7:23 PM IST

తమిళ హీరోయిన్​ ఐశ్వర్యా రాజేశ్​ 'కౌసల్య కృష్ణమూర్తి'తో టాలీవుడ్​కు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు చేరువైంది. 'వరల్డ్​ ఫేమస్​ లవర్' చిత్రం​లో తన నటనతో మెప్పించింది.

ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు స్టార్​ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ భామ నెట్టింట వైరల్​గా మారింది. ఏ సినిమా చిత్రీకరణో తెలీదు గానీ... రోడ్డు పక్కన టిఫిన్​ బండిపై గుడ్డు దోశ వేస్తున్న వీడియోను తన ఇన్​స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. గుండ్రంగా దోశ వేసి బాగా వేశానంటూ ఎంతో హుషారుగా కేరింతలు కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

విక్రమ్​ సరసన 'ధ్రువ నక్షత్రం', తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న 'టక్ జగదీష్'లో హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చూడండి : మంచు మనోజ్ సినిమాకు మెగాహీరో క్లాప్

Last Updated : Mar 6, 2020, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.