బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పోలికలతో ఉన్న అమృతా సాజు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ సెన్సేషనల్ స్టార్‌గా మారింది. ఆ వీడియో యాప్‌లో అమృతను లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఐశ్వర్యను మైమరిపిస్తున్న ఈ అమ్మాయిది కేరళలోని తొడుప్పుజా. కొన్ని ప్రకటనల్లోనూ కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమృతను చూసి చాలా మంది హీరోయిన్ అని భ్రమపడ్డారు. కానీ, ఆమెకు ఇటీవలే హీరోయిన్గా ఓ మలయాళ మూవీలో ఛాన్స్ లభించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మలయాళ చిత్రం 'పికాసో'లో అమృత హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సునీల్ కరియట్టుకర దర్శకత్వం వహిస్తుండగా.. షేక్ అఫ్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమాల్లో నటించాలనే ఆశతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అమృతకు మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఆమె చేసిన టిక్‌టాక్ వీడియోలకూ మంచి స్పందన వస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ నటించిన చిత్రాల్లోని పాపులర్ డైలాగ్‌లతో వీడియోలను చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోందీ అమ్మడు.
ఇదీ చూడండి... మూడేళ్లకే పెళ్లి విషయంలో బన్నీకి అర్హా షాక్