తన మొదటి సినిమా 'చి.ల.సౌ' లాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించాడు రాహుల్ రవీంద్రన్. రెండో చిత్రంగా కింగ్ నాగార్జునతో 'మన్మథుడు 2' తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం మరో కొత్త కథతో రెడీ అయ్యాడట ఈ యువ దర్శకుడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్లో తన తదుపరి సినిమాను చేయబోతున్నాడట రాహుల్. అయితే ఈ చిత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొదట హీరోగా తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం దర్శకుడిగా బిజీ అయ్యాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'చి.ల.సౌ'కు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నాడు.
ఇవీ చూడండి.. 'ఖయ్యమ్ మృతి తీరని లోటు'