ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక సమావేశానికి ముందు తమిళనాడులోని చెన్నైలో బాంబు దాడి కలకలం సృష్టించింది. వీరి భేటీ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ.. స్థానిక కాసినో థియేటర్ వద్ద కొందరు దుండగులు పేలుడుకు పాల్పడ్డారు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం ప్రదర్శితమవుతోంది.
నాటు బాంబు పేల్చిన అనంతరం ఓ మహిళపై కత్తితో దాడి చేశారు. బాధితురాలిని ప్రముఖ రౌడీషీటర్ తొట్టమ్ శేఖర్ మూడో భార్యగా నిర్ధరించారు పోలీసులు. ఆరుగురు సభ్యుల ముఠా ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనకు కారణాలను ఆరా తీస్తున్నారు.
అక్టోబర్ 11-12 తేదీల్లో భారత్, చైనా దేశాధినేతల మధ్య రెండో అనధికార సమావేశం తమిళనాడు వేదికగా జరగనుంది.