బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసానికి కరోనా సోకింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవలే తేలికపాటి జ్వరం రావడం వల్ల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపాడు.
-
🙏🏼🍀❤️ pic.twitter.com/6A1XcDpnp0
— Aftab Shivdasani (@AftabShivdasani) September 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🙏🏼🍀❤️ pic.twitter.com/6A1XcDpnp0
— Aftab Shivdasani (@AftabShivdasani) September 11, 2020🙏🏼🍀❤️ pic.twitter.com/6A1XcDpnp0
— Aftab Shivdasani (@AftabShivdasani) September 11, 2020
"అందరికీ నమస్కారం. మీరంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆశిస్తున్నా. ఇటీవలే కాస్త జ్వరం రావడం వల్ల.. కరోనా పరీక్షలు చేయించుకున్నా. దురదృష్టం కొద్దీ పాజిటివ్ తేలింది. దీంతో వైద్యులు హోమ్ క్వారంటైన్ సూచించారు. చికిత్స పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా."
-అఫ్తాబ్ శివదాసాని, బాలీవుడ్ నటుడు
గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారంతా.. పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు అఫ్తాబ్. ప్రస్తుతం ఇతడు జీ5 రూపొందిస్తోన్న వెబ్‌సిరీస్ 'పాయిజన్2' లో నటిస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది.