లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. రకరకాల పనులు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటుడు అడివి శేష్ మాత్రం.. థ్రిల్లర్ సినిమా 'గూఢచారి' సీక్వెల్‌కు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
26/11 దాడుల్లో వీరమరణం చెందిన ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న 'మేజర్'లో శేష్ ప్రస్తుతం నటిస్తున్నాడు. అయితే కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉంటూ.. ఇందులోని తన పాత్ర కోసం వర్కవుట్స్ చేస్తున్నాడు. ఎడిటింగ్ విషయమై చిత్రబృందంతో వీడియోకాల్స్ చేస్తూ టచ్‌లో ఉన్నాడు.
ఇది చదవండి: అడివి శేష్‌కు దిల్‌రాజు బంపర్ ఆఫర్