ETV Bharat / sitara

'ఆదిపురుష్​' నుంచి అదిరిపోయే అప్​డేట్! - ఆదిపురుష్​ సినిమా న్యూస్​

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం అదిపురుష్​ నుంచి అదిరిపోయే అప్​డేట్​ రానున్నట్లు ఓం రౌత్​ దర్శకుడు తెలిపాడు. మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేయనున్నట్లు చెప్పాడు.

Adipurush Movie
Adipurush Movie
author img

By

Published : Feb 28, 2022, 10:57 PM IST

Prabhas adipurush: 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో ఆయన సినిమాలను రిచ్​గా తీర్చిదిద్దేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు. అలా భారీ బడ్జెట్‌తో తీస్తున్న ప్రభాస్‌ చిత్రాల్లో ఒకటి 'ఆదిపురుష్‌'. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్​డేట్​ ఇచ్చాడు రౌత్​.

మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు రౌత్​ తెలిపాడు. అయితే దేని గురించి ప్రకటన చేస్తామనేది ఆయన చెప్పలేదు. దీంతో దేని గురించి అనౌన్స్​మెంట్​ చేస్తారా? అని ప్రభాస్​ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. టీ సిరీస్​, రెట్రోఫైల్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా, బాలీవుడ్​ నటుడు సన్నీ సింగ్​ లక్ష్మణుడి పాత్రలో, మరాఠి నటుడు దేవ్​దత్త నగే హనుమంతుడిగా కనువిందు చేయనున్నారు.

ఇదీ చూడండి: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఆసక్తికర పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.