తెలుగులో, తమిళ భాషల్లో కథానాయికగా అలరించిన భామ శ్రద్ధా ఆర్య. కేవలం వెండితెరపైనే కాదు, టెలివిజన్ నటిగానూ తనదైన ముద్రవేసింది. హిందీలో రియాల్టీ షోలు, ధారావాహికలతో శ్రద్ధా ఆర్య మరింత గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దిల్లీకి చెందిన నావికదళ అధికారి రాహుల్ శర్మను ఆమె వివాహం చేసుకున్నారు. చివరి నిమిషం వరకూ శ్రద్ధా వివాహం గురించిన వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. వివాహం అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో తెలిపారు. వివాహం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు. శ్రద్ధా ఇండస్ట్రీ స్నేహితులైన అంజుమ్, నేహా అద్విక్, మహాజన్ తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. తెలుగులో 'గొడవ' ఆమె మొదటి సినిమా. వైభవ్ కథానాయకుడు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సాయిరామ్ శంకర్‌తో 'రోమియో'లో నటించారు.
ఇదీ చూడండి: మడోన్నా.. మనసు దోచేస్తున్నావ్ వద్దన్నా!