ETV Bharat / sitara

'వకీల్​సాబ్'​ భామకు కరోనా పాజిటివ్​ - వకీల్​సాబ్​ నివేదా థామస్​ కరోనా

నటి నివేదా థామస్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని తెలిపిన ఆమె.. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు.

niveda thomas
నివేదా థామస్​
author img

By

Published : Apr 3, 2021, 7:31 PM IST

నటి నివేదా థామస్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ప్రస్తుతం తాను వైద్య పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ కరోనా జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే 'వకీల్​సాబ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ.. ఇటీవల కాలంలో ఈ చిత్ర ప్రచారంలో పాల్గొన్నారు.

niveda
నివేదా థామస్​

2002లో మలయాళ చిత్రం 'ఉత్తర'తో బాలనటిగా నివేదా థామస్​ తెరంగ్రేటం చేశారు. అలా పలు మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తూ.. 2016లో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయ్యారు. 2016లో నాని కథానాయకుడుగా విడుదలైన 'జెంటిల్‌మెన్‌' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు​. ఆ తర్వాత మళ్లీ నానితో 'నిన్నుకోరి' వంటి ప్రేమకథతో మెప్పించారు. ఆ తర్వాత 'జై లవకుశ', 'జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌', '118', 'బ్రోచేవారెవరురా' 'వి' సినిమాల్లో నటించిన ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'జెంటిల్​మన్​'తో వచ్చి 'నిన్ను కోరే'లా చేశావ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.