తను క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పింది హీరోయిన్ వాణి భోజన్. కోలీవుడ్లో బుల్లితెరపై నటిగా మొదలైన ఈమె ప్రయాణం వెండితెర వరకు సాగింది. ఇటీవలే వచ్చిన 'ఓ మై కడవలే' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సందర్భంగా జరిగిన ఓ భేటీలో, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.
తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని, అవకాశం కోసం ఓ నిర్మాత తనను, పడకగదికి రమన్నాడని వాణి చెప్పింది. అలాంటి అవకాశం వద్దని అప్పుడే చెప్పేశానంది. ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్ చర్చనీయాంశంగా మారింది.
'మాయ' అనే తమిళ సీరియల్తో అరంగేట్రం చేసిన వాణి.. 'దైవమగళ్'తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గతేడాది వచ్చిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలోనూ హీరోయిన్గా నటించిందీ భామ.