ETV Bharat / sitara

పేజీల కొద్దీ ప్రేమలేఖలు రాశాను: హీరోయిన్ శోభిత - శోభిత గూఢచారి సినిమా

పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శోభిత ధూళిపాళ.. తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. పాఠశాలలో ఉన్నప్పుడే ఓ అబ్బాయికి పేజీల కొద్దీ ప్రేమలేఖలు రాశానని చెప్పింది.

actress sobhita dhulipala about her life, cinema career
పేజీల కొద్ది ప్రేమలేఖలు రాశాను: హీరోయిన్ శోభిత
author img

By

Published : Nov 1, 2020, 10:53 AM IST

Updated : Nov 1, 2020, 11:42 AM IST

మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచి... సినీ రంగంలో స్థిరపడిన తెలుగందం... శోభిత ధూళిపాళ. 'గూఢచారి'లో అడవి శేష్‌ పక్కన మెరిసిన ఈమె.. ప్రస్తుతం మహేశ్‌బాబు నిర్మిస్తున్న 'మేజర్‌'లో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ చెప్పిన ఆసక్తికర ముచ్చట్లివీ...

మాది తెనాలి...

మిస్‌ ఇండియా పోటీలకు వెళ్లిన కొత్తల్లో చాలామంది నేను తెలుగు అమ్మాయినంటే నమ్మలేకపోయారు. మాది తెనాలి. పెరిగింది మాత్రం వైజాగ్‌లో. నాన్న వేణుగోపాల్‌ రావ్‌ మర్చంట్‌ నేవీలో పనిచేశారు. అమ్మ శాంతా రావ్‌ స్కూల్‌ టీచర్‌. ఇప్పుడు ఇద్దరూ రిటైర్‌ అయ్యారు. నాకో చెల్లి.

actress sobhita dhulipala
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల

నమ్మకం...

నాకు భక్తి ఎక్కువ. దేవుణ్ణి నమ్ముతా. ఎక్కడున్నా, ఎన్ని పనులున్నా పొద్దున్నే లేవగానే యోగా, స్నానం చేసేసి బుద్ధిగా పూజ చేసుకుంటా. ప్రతిరోజూ సూర్యాష్టకం చదువుకుంటా. నేను అలా చేయడం మా అమ్మకు ఎంతిష్టమో. ఆ తర్వాత నా వంట నేనే చేసుకుంటా. పూర్తిగా శాకాహారిని. బయట తినడం ఇష్టం ఉండదు. అలానే ఇంట్లో పనులకు ఎవరి మీదా ఆధారపడను. నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను.

సరదా జ్ఞాపకాలు

చిన్నప్పుడు స్కూల్లో కెప్టెన్‌ మీద క్రష్‌ ఉండేది. అతను మాత్రం నన్ను పట్టించుకునేవాడు కాదు. దాంతో పేజీల కొద్దీ ప్రేమ లేఖలు రాసేదాన్ని. మరోవైపు నాకూ ప్రేమలేఖలు వచ్చేవి. ఒక అబ్బాయి అయితే ఆర్య సినిమాలోలా నా చుట్టూ సైకిల్‌ తొక్కుతుండేవాడు. అలానే ఒకసారి ఏదో విషయంలో అబద్ధం చెప్పి అమ్మకు దొరికిపోయా. చెంపలు రెండూ ఎడాపెడా వాయించేసింది. ఆ దెబ్బలు ఇప్పటికీ గుర్తున్నాయి. తను చేయి చేసుకోవడం అదే మొదటీ, చివరిసారి.

actress sobhita dhulipala
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల

అలా సినిమాల్లోకి...

అందాల పోటీల తర్వాత నాకు మోడలింగ్‌పైన ఆసక్తి కలిగింది. కానీ అక్కడ ఎవరూ తెలియదు, పరిచయాలు లేకుండా మోడల్‌గా అవకాశాలు తెచ్చుకోవడం చాలా కష్టం. పోర్ట్‌ఫోలియో పట్టుకుని క్యాస్టింగ్‌ డైరెక్టర్ల చుట్టూ తిరిగేదాన్ని. వేల ఆడిషన్లలో పాల్గొన్నా. మిస్‌ ఇండియా రన్నరప్‌ను అయి ఉండి కూడా అంత కష్టపడితేనే 2014లో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ మోడల్‌గా అవకాశం వచ్చింది. తర్వాత పలు ప్రకటనలు చేశా. అవి చేస్తున్నప్పుడే అనురాగ్‌ కశ్యప్‌ 'రమణ్‌ రాఘవ2.0' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అలా అనుకోకుండా సినిమాల్లోకీ, ఆ తరవాత వెబ్‌సిరీస్‌లోకీ అడుగు పెట్టా.

డ్రీమ్‌ రోల్‌...

నేను ఎన్ని సినిమాలూ, వెబ్‌సిరీస్‌లూ చేసినా తెలుగులో నటించిన 'గూఢచారి' మాత్రం చాలా ప్రత్యేకం. ఆ సినిమా చూసి మా అమ్మ ఎంత సంతోషించిందో. చెబితే నమ్మరేమోగానీ తనింత వరకూ నేను వేరే భాషల్లో నటించినవి చూడలేదు. ప్రస్తుతం తెలుగులో 'మేజర్‌'తోపాటు తమిళం, మలయాళం, హిందీల్లో మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నా. పీరియడ్‌ డ్రామాలూ, పొలిటికల్‌ సెటైర్‌ కోణంలో వచ్చే సినిమాల్లో నటించడం నా కల. అలానే కార్పొరేట్ లాలో మాస్టర్స్‌ చేయాలని ఉంది.

ఎకనమిక్స్‌ ఇష్టం

నాకు అర్థశాస్త్రం అంటే ఇష్టం. పెద్దయ్యాక రాష్ట్రపతికి ఆర్థిక సలహాదారుని కావాలని చిన్నప్పుడు కలలు కనేదాన్ని. అందుకే ఇంటర్‌ అయ్యాక ముంబయి వెళ్లి చదువుకోవాలనుకున్నా. అలా ముంబయి వెళ్లేవరకూ నాకు ఫ్యాషన్‌ గురించి ఎక్కువ తెలియదు. నాతో కలిసి ఉంటున్న ఓ స్నేహితురాలు ఆ సమయంలో ఫెమినా మిస్‌ ఇండియా పేజెంట్‌ బృందంలో ఇంటర్న్‌షిప్పు చేస్తోంది. తనే నాకు చెప్పకుండా నా పేరును ఆ పోటీలకు ఇచ్చేసింది. దాంతో ఎలా ఉంటుందో చూద్దామని ఆడిషన్‌కు వెళ్లా. అప్పుడే మొదటిసారి లిప్‌స్టిక్‌, హైహీల్స్‌ వేసుకోవడం. కానీ అక్కడకు వెళ్లాక నేను ఈ పోటీల్లో గెలిస్తే బాగుంటుందనిపించింది. చివరికి రన్నరప్‌గా నిలవడం మాత్రం గర్వంగా ఉంది.

actress sobhita dhulipala
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల

ఎప్పుడూ అనుకోలేదు

చిన్నప్పుడు తరగతి పుస్తకాలతోపాటు రకరకాల నవలలూ, హారీపోటర్‌ పుస్తకాలు చదివేదాన్ని. భరతనాట్యం, గిటార్‌ కూడా నేర్చుకున్నా. ఖాళీ సమయాల్లో కవితలు రాసేదాన్ని. సినిమాల ఆలోచనగానీ, చూడటంగానీ ఎప్పుడూ చేయలేదు. మా ఇంట్లో వాళ్లతో కలిసి 'ఆనంద్‌' సినిమా చూసిన గుర్తు ఉంది. అంతేకాదు, నేను మొదటి సినిమాలో నటించే నాటికి చూసిన సినిమాల సంఖ్య పాతికే. అదే చిన్నప్పట్నుంచే చూసుంటే ఆ వయసులోనే హీరోయిన్‌ అవ్వాలని కలలు కనేదాన్నేమో.

Last Updated : Nov 1, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.