ETV Bharat / sitara

తారక్​తో మరోసారి నటించనున్న శ్రుతిహాసన్​! - ఎన్టీఆర్​ న్యూస్​

కమల్‌ హాసన్‌ కూతురిగా సినీరంగ ప్రవేశం చేసినా.. నటనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శ్రుతిహాసన్‌. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న శ్రుతి.. తారక్​-త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్​గా నటించబోతుందని సమాచారం.

Actress Shruthi Hasan will lead in NTR-Trivikram's Movie?
తారక్​తో మరోసారి నటించనున్న శ్రుతిహాసన్​!
author img

By

Published : Apr 25, 2020, 8:33 PM IST

యంగ్​టైగర్ ​ఎన్టీఆర్‌-త్రివిక్రమ్​ల కాంబినేషన్​లో త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పూర్తి చేసే పనిలో ఉన్నారట. అయితే ఇందులో కథానాయికగా ఎవరిని తీసుకుంటారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ ఇద్దరు భామలతో చిందేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రంలో ఓ కథానాయికగా శ్రుతిహాసన్‌ని తీసుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పూజాహెగ్డే బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ పేర్లూ వినిపించాయి. ఇక శ్రుతిహాసన్‌ విషయానికొస్తే గతంలో 'రామయ్య వస్తావయ్యా'లో తారక్​తో కలిసి నటించగా.. పూజాహెగ్డే..'అరవింద సమేత వీర రాఘవ'తో మెప్పించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శ్రుతిహాసన్​ ప్రస్తుతం రవితేజ హీరోగా గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రాక్​' చిత్రంలో హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చూడండి.. పీపీఈ కిట్స్‌ విరాళమిచ్చిన విద్యాబాలన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.