ETV Bharat / sitara

ఇక్కడ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి: పాయల్ - హీరోయిన్ పాయల్ రాజ్​పుత్ వార్తలు

టాలీవుడ్​లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని తెలిపింది హీరోయిన్ పాయల్. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు పైకెక్కాలని చెప్పింది.

actress payal rajput about her career in tollywood
నటి పాయల్ రాజ్​పుత్
author img

By

Published : Sep 6, 2020, 7:15 AM IST

"దీర్ఘకాలిక ప్రణాళికలు ఏ రంగంలోనైనా చెల్లుతాయేమో కానీ, చిత్ర పరిశ్రమలో కాదు" అంటోంది నటి పాయల్‌ రాజ్‌పూత్‌. తన తొలి సినిమా 'ఆర్‌ఎక్స్‌ 100'తోనే బోల్డ్‌ పెర్ఫామెన్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ అమ్మడు.. 'వెంకీమామ', 'డిస్కోరాజా' చిత్రాలతో నటనా ప్రాధాన్య పాత్రలతోనూ మెప్పించగలనని నిరూపించింది. "మరి నటిగా మీరెలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉన్నారు" అని ప్రశ్నిస్తే.. "విభిన్న పాత్రలతో మెప్పించాలనే అనుకుంటున్నా తప్ప ప్రత్యేకంగా ఎలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోలేదు" అని బదులిచ్చింది.

"మిగతా రంగాలతో పోల్చితే ఈ పరిశ్రమ చాలా భిన్నమైనది. ఏడాదికి చకచకా ఐదారు సినిమాలు చేసేయాలి. ఫలానా అగ్ర హీరోలతో నటించేయాలి అనే లెక్కలు పనికిరావు. ఎందుకంటే ఇక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడూ అన్నిటికీ సిద్ధపడే ఉండాలి. ముందే అనవసర పరుగులకు పోకూడదనుకుంటా. ఇప్పుడున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టూ పైకి ఎదగాలి. ప్రస్తుతాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ.. చేస్తున్న పని పట్ల పూర్తి నిబద్దతతో వ్యవహరిస్తూ ముందుకెళ్తే చాలు. బంగారు భవిష్యత్తు దానంతటదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది" అని చెప్పింది పాయల్‌.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.