రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. నటి శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ... హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో కూతురితో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సూచించారు. తను మరో ముగ్గురికి ఈ గ్రీన్‌ఛాలెంజ్‌ను విసిరారు. నీరజ డిజైనర్, సంధ్య డాన్సర్ , సందీప్ కిషన్‌లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు