కథానాయిక రాయ్ లక్ష్మీ తండ్రి రామ్ రాయ్ కన్నుమూశారు. తన నాన్నను బతికించుకోలేకపోయానంటూ ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కన్నతండ్రి ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
-
U taught me to be strong...but I m sorry I can never be enough to accept that u are no longer here 😢❤️ I miss u dadda love u the most ❤️ pic.twitter.com/wLH2YK6Upz
— RAAI LAXMI (@iamlakshmirai) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">U taught me to be strong...but I m sorry I can never be enough to accept that u are no longer here 😢❤️ I miss u dadda love u the most ❤️ pic.twitter.com/wLH2YK6Upz
— RAAI LAXMI (@iamlakshmirai) November 7, 2020U taught me to be strong...but I m sorry I can never be enough to accept that u are no longer here 😢❤️ I miss u dadda love u the most ❤️ pic.twitter.com/wLH2YK6Upz
— RAAI LAXMI (@iamlakshmirai) November 7, 2020
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"డాడ్.. ఐ మిస్ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను. ఈ లోటుతోనే జీవించేందుకు ప్రయత్నిస్తాను. మీరు నన్ను ప్రేమించినట్లు మరెవరూ ప్రేమించలేదు. మా నాన్న ఇకలేరని చెబుతుంటే.. నా గుండె ముక్కలు అవుతోంది. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంతో ప్రయత్నించాను డాడీ. కానీ రక్షించుకోలేకపోయినందుకు క్షమించండి. అంతా సజావుగా జరుగుతుందని చెప్పడానికి పక్కనే మీరు ఉంటే బాగుండేదని నా మనసు చెబుతోంది. మీరే నా బలం, జీవితంలో నాకు ఏం కావాలన్నా ఇచ్చారు. నేను మీ కుమార్తెను కావడం నా అదృష్టం. నేనెప్పుడూ స్వేచ్ఛగా, దృఢంగా ఉండాలని మీరు ఎందుకు కోరుకునేవారో అర్థమైంది. ఏదో ఒక రోజు మీరులేని లోటును నేను భరించాలని, తట్టుకోవాలని అలా చెప్పేవారు. ఇప్పుడు మీరు.. నొప్పి, బాధలేని ప్రశాంతమైన చోటులో ఉన్నారని నా మెదడుకు తెలుసు. దీన్ని నా మనసుకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. మీరు పై నుంచి నన్ను ఆశీర్వదిస్తారని, ముందుకు నడిపిస్తారని నాకు తెలుసు. మీరు నన్ను నమ్మారు. మీరు కోరిన కోర్కెను మీ చిట్టి కూతురు తప్పకుండా నెరవేరుస్తుంది, గర్వించేలా చేస్తుంది. బంగారు మనసున్న వ్యక్తి హృదయం కొట్టుకోవడం ఆపేసింది.. ఇది నా జీవితంలోనే అంధకారంతో కూడుకున్న సమయం. ఆయన ఇంత నొప్పిని భరించడం ఇష్టం లేక దేవుడు తనతో తీసుకెళ్లాడు. మా నాన్న ఎప్పుడూ మాతోనే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మేం ఎంతో మిస్ అవుతున్నాం. ఐ లవ్ యూ"
-రాయ్ లక్ష్మీ, నటి
ప్రస్తుతం ఝాన్సీ భైరవి(కన్నడ), తెలుగులో సిండ్రిల్లా, ఆనంద భైరవి సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు రాయ్ లక్ష్మీ.