దర్శకుడు ఓం రౌత్-హీరో ప్రభాస్ కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'ఆదిపురుష్'. హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కృతిసనన్.. సీత పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ చేతిలో కనిపించిన ఓ పుస్తకం.. ఆమె ఈ పాత్ర కోసం ఎలా సన్నద్ధమవుతుందో తెలుపుతోంది.
'ది ఫారెస్ట్ ఆఫ్ ఎన్చాంట్మెంట్స్' పుస్తకాన్ని ఆమె చదువుతోంది. సీత కోణంలో రామాయణాన్ని వివరిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు చిత్ర బెనర్జీ దివకరుని.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రల్లో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకుడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఇదీ చదవండి: అభిమాన తారల లుక్స్ రీక్రియేట్.. నెటిజన్లు ఫిదా