'తీన్మార్', 'ఒంగోలు గిత్త' సినిమాల్లో నటించిన కృతి కర్బందా... ప్రేమలో మునిగితేలుతందట. బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఒప్పుకొంది. పుల్కిత్తో ప్రేమ వ్యవహారం గురించి కృతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"అవును మొదట నేను పుల్కిత్తో సన్నిహితంగానే ఉన్నా. అతను నా అభిప్రాయాలను గౌరవించాడు. మన మనసుకు దగ్గరైన వ్యక్తి, ఇష్టాలు తెలుసుకుని నడుచుకునే అబ్బాయిని ఏ అమ్మాయి అయినా వదులుకుంటుందా? అందుకే నేను అతని ప్రేమలో పడిపోయా.. ముందు ఇంట్లో వాళ్లు పుల్కిత్ గురించి ఒప్పుకుంటారా లేదా అని బెంగపడ్డాను. ఒక్కోసారి మనసులోని ప్రేమను తెలియజేయడానికి సంవత్సరాలు పట్టొచ్చు... కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ నా విషయంలో అది నెలల కాలంలోనే నెరవేరింది. నేను చాలా అదృష్టవంతురాలిని".
--కృతి కర్బందా, నటి
పుల్కిత్ సామ్రాట్‌కు శ్వేతా రోహిరాతో 2015లో వివాహం జరిగింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో హీరోయిన్ యామీ గౌతమితో ఈ హీరో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం కృతి - పుల్కిత్ కలిసి అనీష్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాగల్ పంతీ’లో నటిస్తున్నారు. ఇందులో అనీల్ కపూర్, జాన్ అబ్రహాం, ఇలియానా తదితరలు నటిస్తున్నారు. నవంబర్ 22న(శుక్రవారం) సినిమా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">