ETV Bharat / sitara

ప్రేమలేఖ ఇచ్చిన ఆ అబ్బాయికి రాఖీ కట్టా: అంజలి

author img

By

Published : Oct 4, 2020, 8:22 AM IST

Updated : Oct 4, 2020, 8:40 AM IST

హైదరాబాద్ రోడ్లపై తిరిగితే చాలా ప్రశాంతంగా ఉంటుందని హీరోయిన్ అంజలి చెప్పింది. అలానే పాఠశాలలో చదువుతున్నప్పుడు ప్రేమలేఖ ఇచ్చిన అబ్బాయికి రాఖీ కట్టానని తెలిపింది.

actress anjali about her love life
ప్రేమలేఖ ఇచ్చిన ఆ అబ్బాయికి రాఖీ కట్టా: అంజలి

అంజలి... మాట, నటన అన్నీ సహజంగానే ఉంటాయి. కెరీర్‌లో ఎత్తుపల్లాలున్నా ఎప్పటికప్పుడు నటనతో మెప్పిస్తున్న ఈ తెలుగింటి ఆడపడుచు తన మనసులోని ముచ్చట్లను వివరించిందిలా..

నటి కాకపోయి ఉంటే...

ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చిన్నప్పటినుంచీ నా కల సినిమారంగంలోకి రావడమే. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు టీచర్‌ మమ్మల్ని పెద్దయ్యాక ఏమవుతారని అడిగారు. అందరూ ఇంజినీర్‌, డాక్టర్‌ అంటూ ఏవేవో చెబుతుంటే నేను మాత్రం హీరోయిన్‌ అవుతానని అన్నానట.

actress anjali about her life
హీరోయిన్ అంజలి

ప్రేమలేఖలు...

చిన్నప్పటినుంచీ ఇప్పటి దాకా వస్తూనే ఉన్నాయి. తొమ్మిది లేదా పదో తరగతిలో అనుకుంటా... మా స్కూల్లో ఓ అబ్బాయి నా వెంట పడేవాడు. ఒకరోజు నా చేతికి ప్రేమలేఖ ఇచ్చాడు. నేనేమో మర్నాడు అతడి చేతికి రాఖీ కట్టా. అతడేమో.. రాఖీ కట్టినంత మాత్రాన అన్నయ్యను కానూ అంటూ దాన్ని పడేసి వెళ్లిపోయాడు.

మర్చిపోలేని జ్ఞాపకం...

ఓసారి స్కూల్‌ఫంక్షన్‌లో డ్యాన్స్‌ చేశా. అయితే ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడి సాయంత్రం వరకూ ఇంటికి వెళ్లకుండా పెరట్లోనే దాక్కున్నా. చివరకు పెద్దవాళ్లు వెతికి అలా చెప్పకుండా వెళ్లిపోకూడదని మందలించారు.

అదే నా బలం...

వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సమస్యలు ఎదురైనా అన్నింటినీ పాజిటివ్‌గానే తీసుకుంటా. ఏది జరగాలో అదే జరుగుతుంది కాబట్టి అంతా నా మంచికే అనుకుంటా.

actress anjali about her life
హీరోయిన్ అంజలి

నటనంటే...

మనలానే నటించాలని అనుకుంటా. లేదంటే ఆ పాత్రకు న్యాయం చేయలేమని అనిపిస్తుంది. 'సీతమ్మ వాకిట్లో...' సినిమాలో ఇదే జరిగింది. మొదటి రెండుమూడు రోజులు సీతలా చేయలేక చాలా కంగారు పడిపోయా. ఆ తరువాత బాగా ఆలోచించి.. డైలాగుల్ని నేనెలా చెప్తానో అలాగే చెప్పడం మొదలుపెట్టేసరికి ధైర్యం వచ్చింది.

ఇష్టపడే హీరోయిన్లు...

కాజోల్‌, శోభన.

నచ్చిన ప్రాంతం...

షూటింగుల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్లినా.. హైదరాబాద్‌ రోడ్లమీద తిరుగుతుంటే హాయిగా అనిపిస్తుంది.

అభిమానులు...

ఎక్కడికైనా వెళ్లినప్పుడు అభిమానుల ప్రేమ చూస్తే ఆనందంగా అనిపిస్తుంది. 'జర్నీ' సినిమా విడుదలయ్యాక ఓసారి ఎక్కడికో వెళ్తే.. 'మీ లాంటి అమ్మాయినే చూడమని ఇంట్లో చెప్పా. మీరే చేసుకుంటే మరీ ఆనందం' అన్న అభిమానులూ ఉన్నారు.

ఇష్టమైన దర్శకుడు...

మణిరత్నం. కొన్ని సినిమా ఫంక్షన్లలో ఆయన్ని కలిశా కానీ... ఆయన దర్శకత్వంలో నటించాలనేది నా కోరిక

actress anjali about her life
హీరోయిన్ అంజలి

ఆమే స్నేహితురాలు...

సినిమా రంగంలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు కానీ... నేను ప్రతి విషయాన్నీ పంచుకునేది మాత్రం నా తొలి సినిమా 'ఫొటో'లో నాతో కలిసి నటించిన భాను అనే అమ్మాయితోనే. ఇప్పటికీ తనతోనే నా వ్యక్తిగత విషయాలన్నీ చెబుతుంటా.

నచ్చే ఆహారం...

రెడ్‌ థాయ్‌కర్రీ... చిక్కీలు

ఇష్టమైన సంగీత దర్శకుడు...

ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం నచ్చుతుంది. అయితే మ్యూజిక్‌నే కాకుండా... ఆ పాట సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకుంటా.

Last Updated : Oct 4, 2020, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.