Anasuya Latest Video: సినీనటి, వ్యాఖ్యాత అనసూయ సోషల్‌మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె నెట్టింట్లోనూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ చురుగ్గా ఉంటుంది. తాజాగా తనకు సంబంధించిన ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారు విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల 'పుష్ప', 'ఖిలాడి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ. ఇందులోని ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. 'ఆచార్య', 'భీష్మ పర్వం', 'ఖిలాడి', 'పక్కా కమర్షియల్', 'రంగ మార్తాండ' చిత్రాల్లోనూ ఈమె నటిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
Sudheerbabu new movie: యంగ్ హీరో సుధీర్‌బాబు కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇది ఆయనకు 16వ చిత్రం. అనంద్ ప్రసాద్ దర్శకత్వం నిర్మిస్తున్న ఈ మూవీకి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, భరత్ కీలక పాషిస్తున్నారు.
Surya ET movie: సూర్య నటిస్తున్న కొత్త చిత్రం 'ఈటి'. ప్రస్తుతం ఆయన ఈ మూవీ డబ్బింగ్ పనుల్లో బిజీ ఆయ్యారు. తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకోవడం విశేషం.సన్ పిక్చర్స్ నిర్మాణంలో పాండిరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఐదు (తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చూడండి: అందుకు నన్ను క్షమించండి: అనసూయ