చిత్ర పరిశ్రమ కొత్త ప్రయోగాలను ప్రోత్సాహించడంలో మరింత పరిపక్వత చెందిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు చాలా మంది హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఇమేజ్ ఎక్కడ తగ్గిపోతుందో, అభిమానుల్లో తమ ఆదరణ ఎక్కడ కరువైపోతుందో అని కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండేవారు. కానీ దశాబ్ద కాలంగా ఆ రోజులు పోయాయి. కథ నచ్చితే చాలు.. తమ స్టార్డమ్తో సంబంధం లేకుండా అభిమానులను మెప్పించే పాత్ర ఏదైనా పండించడానికి సిద్ధం అంటున్నారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలు పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటులెవరు? ఏ సినిమాల్లో వీరు నటించారు? వంటి విషయాల సమాహారమే ఈ కథనం.
అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్.. తాజాగా 'లక్ష్మీబాంబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అక్షయ్.. ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన 'కాంచన' సినిమా రీమేక్.
శరద్ కల్కర్
లక్ష్మీబాంబ్ సినిమాలోనే ఫ్లాష్‌బ్యాక్‌లో సీనియర్ నటుడు శరద్ కల్కర్ కూడా థర్డ్‌జెండర్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
పరేష్ రావల్
1997లో విడుదలైన 'తమన్నా' సినిమా.. అప్పట్లో విజయం సాధించింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు పరేష్ రావల్ పోషించిన టిక్కు(ట్రాన్స్‌జెండర్) పాత్ర విమర్శకులు ప్రశంసలను పొందింది.
అషుతోష్ రానా
'సంఘర్ష్' సినిమాలో లజ్జా శంకర్‌గా నటుడు అషుతోష్ రానా పోషించిన ప్రతినాయకుడి పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. సైకో థర్డ్‌జెండర్‌గా ఆయన నటనకు జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా.
మహేశ్ మంజ్రేకర్
2013లో విడుదలైన 'రజ్జో' సినిమాలో బేగమ్‌గా నటుడు మహేశ్ మంజ్రేకర్ నటించారు.
సదాశివ్
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించిన 'సడక్' సినిమా అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ట్రాన్స్‌జెండర్‌గా నటించిన సదాశివ్ అమ్రాపుర్కర్కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది.
ప్రశాంత్ నారాయణ్
2011లో విడుదలైన 'మర్డర్ 2' సినిమాలో ప్రశాంత్ నారాయణ్ ఈ పాత్రలో కనిపించారు.
నిర్మల్ పాండే
'దాయరా' సినిమాలో థర్డ్‌జెండర్ పాత్రను సీనియర్ నటుడు నిర్మల్ పాండే పోషించారు.
ఇదీ చూడండి : మోడ్రన్ దుస్తుల నుంచి మాస్ గెటప్పుల్లోకి!